Share News

చివరికి.. మళ్లీ పరుగులే!

ABN , Publish Date - Apr 09 , 2025 | 12:47 AM

అకాలవాన అన్నదాతను ఏడిపిస్తోంది.. నిండు వేసవిలో వరుణ దాడి తెలియక రైతాంగం లబోదిబోమంటున్నారు.

చివరికి.. మళ్లీ పరుగులే!
అకాలవాన : గౌరీపట్నం జాతీయరహదారిపై తడుస్తున్న ధాన్యానికి తడుస్తూ బరకాలు కప్పుతున్న రైతులు

దేవరపల్లి, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి) : అకాలవాన అన్నదాతను ఏడిపిస్తోంది.. నిండు వేసవిలో వరుణ దాడి తెలియక రైతాంగం లబోదిబోమంటున్నారు. వాతా వరణ మార్పులతో ఉరుకులు..పరుగులు పెడుతున్నారు.దేవరపల్లి మండలం లోని గౌరీపట్నం, దుద్దుకూరు, త్యాజంపూడి, కృష్ణం పాలెం, రైతులు తాము ఆరుగాలం పండించిన పంటను జాతీయ రహదారులకు ఇరువైపులా ఆరబెట్టా రు. ఉదయం నుంచి భానుడు మండిపడ్డాడు.. వాతావరణం బాగానే ఉందని ఎక్కడ వారు అక్కడ సర్దుకున్నారు. మంగళవారం సాయంత్రం అకాల వర్షం రావడంతో ధాన్యాన్ని కాపాడుకోవడానికి రైతులు పరుగులు తీశారు. ధాన్యం పొగేసి బరకాలు కప్పారు.అయినప్పటికి వర్షం వల్ల కింద నుంచి తేమచేరి రంగుమారడం, మొలకలు రావడం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పల్లంట్ల, కురుకూరు, లక్ష్మీపురం గ్రామాల్లో కళ్లేలపై ఆరబెట్టిన ఎండుమిర్చి వర్షానికి తడిచి ముద్దయ్యింది. దీని వల్ల రంగు మారి కాయ లు గుల్లబారతాయని రైతులు వాపోతున్నారు. అకాల వర్షం కారణంగా మొక్కజొన్న, పొగాకు తోటలకు నష్టం వాటిల్లింది. ఈదురుగాలుల కారణంగా యర్నగూడెం ప్రధాన సెంటర్‌లో ఒక్కసారిగా కొబ్బరిచెట్టు పడింది. అల్పపీడన ప్రభావంతో భారీ ఈదురుగాలులు, భారీ వర్షంతో రైతులకు తీవ్రనష్టం వాటిల్లింది.

Updated Date - Apr 09 , 2025 | 12:47 AM