TDP MLA: ఆళ్ల నాని ఎంట్రీ.. ఏలూరు ఎమ్మెల్యే రియాక్షన్

ABN, Publish Date - Feb 14 , 2025 | 04:11 PM

Eluru MLA Badeti Radhakrishna: మాజీ మంత్రి ఆళ్ల నాని.. టీడీపీలో చేరడంపై ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి స్పందించారు. తెలుగుదేశం పార్టీ మహా సముద్రమని ఆయన అభివర్ణించారు. ఫార్టీలోకి కొందరు వస్తుంటారని.. మరికొందరు పోతుంటారన్నారు.

TDP MLA: ఆళ్ల నాని ఎంట్రీ.. ఏలూరు ఎమ్మెల్యే రియాక్షన్

ఏలూరు, ఫిబ్రవరి 14: మాజీ డిప్యూటీ సీఎం, మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరికపై ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ (చంటి) శుక్రవారం ఏలూరులో స్పందించారు. ఆళ్ల నాని పార్టీలో చేరడం.. అధిష్టానం నిర్ణయమని తెలిపారు. అధిష్టానం నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు తప్పక శిరసా వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలోకి రావడం ఏలూరులోని స్థానిక కేడర్‌కు ఇష్టం లేకపోయినప్పటికీ.. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఆళ్ల నాని పార్టీలో చేరికపై తమ కార్యకర్తలకు నచ్చ చెప్పామన్నారు.

ఈ నేపథ్యంలో మా వాళ్లు ప్రస్తుతం వారిపై ఎటువంటి కామెంట్స్ చేయడం లేదన్నారు. ఇక ఆళ్ల నాని సైతం.. టిడిపి క్యాడర్‌తో మమేకం అవ్వాలని కోరారన్నారు. అయినా తెలుగుదేశం పార్టీ మహాసముద్రం లాంటిదని.. అందులోకి ఎంత మంది వచ్చినా ఇక్కడ స్థానం ఉంటుందని ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ వివరించారు. అదీకాక ఎంతోమంది పార్టీలోకి వస్తుంటారు.. పోతుంటారన్నారు. తెలుగుదేశం పార్టీ ఎంతోమంది నాయకులను తయారు చేసిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ కూటమి ప్రభుత్వం ఆశలు.. ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలని ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ అభిప్రాయపడ్డారు.


2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు ఎమ్మెల్యేగా ఆళ్ల నాని ఎన్నికయ్యారు. అప్పటి టీడీపీ అభ్యర్థి బడేటి బుజ్జి (ప్రస్తుత ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ సోదరుడు)పై కేవలం 3 వేల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అనంతరం జగన్ తొలి విడత కేబినెట్‌లో వైద్య ఆరోగ్య శాఖతోపాటు డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టారు. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో ఆయన ఆ పదవిని కోల్పోయారు. అయితే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి బరిలో నిలిచి.. 164 స్థానాలను కైవసం చేసుకొంది. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది.

Also Read: బ్యాంకర్లకు మంత్రి తుమ్మల చురకలు.. ఎందుకంటే..?


మరోవైపు వైసీపీలో రాజీనామాల పర్వం మొదలైంది. ఆ జాబితాలో ఆళ్ల నాని కూడా ఉన్నారు. ఇవే ఎన్నికల్లో ఏలూరు అసెంబ్లీ ఎమ్మెల్యేగా వైసీపీ అభ్యర్థి ఆళ్ల నానిపై టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణ ఘన విజయం సాధించారు. ఎన్నిక ఫలితాలు వచ్చిన కొన్ని నెలలకే టీడీపీలో చేరేందుకు ఆళ్ల నాని ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ఆళ్ల నాని టీడీపీలో చేరడాన్ని స్థానిక కేడర్ తీవ్రంగా వ్యతిరేకించింది.

Also Read: వసంత ప్రాణం తీసిన.. ఆ వీడియోలు


అంతేకాదు.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆళ్ల నాని వర్గం.. ఏలూరు టీడీపీ కేడర్ పట్ల వ్యవహరించిన తీరు వల్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామనంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆళ్ల నాని రాకను టీడీపీ అధిష్టానం కొద్దిరోజుల పాటు నిలుపుదల చేసింది. అదే సమయంలో ఆళ్ల నాని వ్యవహారాన్ని ఏలూరు టీడీపీ అధ్యక్షుడుతోపాటు స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణతో పలు దఫాలుగా చర్చించింది.


అనంతరం ఆళ్ల నాని పార్టీలోకి ఎంట్రికి ముహుర్తం ఖరారు అయింది. దీంతో ఆళ్ల నాని గురువారం టీడీపీలో కండువా కప్పుకున్నారు. ఇక బడేటి రాధాకృష్ణ సోదరుడు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి 2019 డిసెంబర్ మాసంలో గుండె పోటుతో మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన సోదరుడు బడేటి రాధాకృష్ణకు గతేడాది జరిగిన ఎన్నికల్లో ఏలూరు అసెంబ్లీ టికెట్ పార్టీ అధిష్టానం కేటాయించిన విషయం విధితమే.

For AndhraPradesh News And Telugu News

Updated Date - Feb 14 , 2025 | 04:12 PM