IRCTC: ప్రయాణికులకు అలర్ట్.. కీలక ప్రకటన చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే..
ABN, Publish Date - Mar 14 , 2025 | 01:48 PM
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయా ఎక్స్ ప్రెస్ రైళ్లకు అదనపు స్టాపేజీలను కొనసాగిస్తూ దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వలను జారీ చేసింది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

విజయవాడ: పలు రైళ్లకు అదనపు స్టాపేజీ(Stoppage)లను మరో ఆరు నెలల పాటు ప్రయోగాత్మకంగా కొనసాగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 17011 హైదరాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్, 17012 సిర్పూర్ కాగజ్‌నగర్-బీదర్(Sirpur Kagaznagar-Bidar), 12713 విజయవాడ-సికింద్రాబాద్, 12714 సికింద్రాబాద్-విజయవాడ, 12706 సికింద్రాబాద్-గుంటూరు, 12705 గుంటూరు-సికింద్రాబాద్ రైళ్లు ఈ రోజు నుంచి చర్లపల్లి స్టేషన్‌లో ఆగుతాయి. 12072 హింగోళిడెక్కన్-ముంబయి సీఎస్ఎన్ టెర్మినస్ అప్ అండ్ డౌన్ రైళ్లు, పర్టూరు, సెలులో 20701, సికింద్రాబాద్-తిరుపతి అప్ అండ్ డౌన్ రైలు మిర్యాలగూడలో, 17646 రేపల్లె-సికింద్రాబాద్ రామన్నపేటలో ఆగుతాయి.
ఈ వార్తను కూడా చదవండి: మాజీ మంత్రి శ్రీరాములు ఆగ్రహం.. చివరకి ఆ విషయంపై కూడా రాజకీయమా..
12787 నర్సాపూర్-నాగర్‌సోల్ ఎక్స్‌ప్రెస్ 15, 16 తేదీల్లో మహబూబాబాద్‌లో ఆగుతుంది. 17479 పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్ ఈ నెల 20న, 17480 తిరుపతి-పూరి ఈ నెల 21న, 17481 బిలా్‌సపూర్-తిరుపతి ఈ నెల 18న, 17482 తిరుపతి-బిలా్‌సపూర్ రైళ్లు ఈ నెల 16న కొవ్వూరు స్టేషన్‌లో ఆగుతాయి. 20896 భువనేశ్వర్-రామేశ్వరం రైలు ఈ నెల 21న, 20895 రామేశ్వరం-భువనేశ్వర్ రైలు ఈ నెల 23న, 12867 హౌరా-పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్ ఈ నెల 23న, 16583 పుదుచ్చేరి-హౌరా ఈ నెల 19వ తేదీన రాజమండ్రి స్టేషన్‌లో ఆగుతాయి.
16583 యశ్వంత్‌పూర్-లాతూర్ ఎక్స్‌ప్రెస్ ఈ రోజు, 16584 లాతూర్-యశ్వంత్‌పూర్ ఈ నెల 15న కమలానగర్ స్టేషన్‌లో ఆగుతాయి. 22151 పూణే-ఖాజీపేట ఈ నెల 21న, 22152 ఖాజీపేట-పూణే ఈ నెల 23న మంచిర్యాల స్టేషన్‌లో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి:
జర్నలిస్టులుగా అసభ్య పదజాలం వాడొచ్చా..
Read Latest Telangana News and National News
Updated Date - Mar 14 , 2025 | 03:24 PM