Gold Robbery Arrests: బంగారం దోపిడీ కేసులో మరో ఐదుగురు అరెస్టు
ABN , Publish Date - Apr 09 , 2025 | 04:41 AM
ఆంధ్రా తమిళనాడు సరిహద్దులో జరిగిన బంగారం దోపిడీ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. ఒక నిందితుడు అవమాన భారంతో ఆత్మహత్య చేసుకున్నాడు

అవమాన భారంతో ఓ నిందితుడి ఆత్మహత్య
వి.కోట, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): ఆంధ్రా-తమిళనాడు రాష్ర్టాల సరిహద్దులోని నాయకనేరి అటవీ ప్రాంతంలో వారం రోజుల క్రితం జరిగిన బంగారం దోపిడీ కేసులో మరో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ డి.ప్రభాకర్, సీఐ సోమశేఖర్ తెలిపారు. మంగళవారం వి.కోటలో మాట్లాడుతూ.. నాయకనేరి అటవీ ప్రాంతంలో అనమానాస్పదంగా కనిపించిన తమిళనాడు రాష్ట్రం పేర్నాంబట్ సమీపంలోని కల్లిపేటకు చెందిన వేదాచలం, కుమరేశన్, రంజిత్, దీపన్ చక్రవర్తి, సూరవేల్‌ను విచారించి, బంగారం దోపిడీ కేసులో నిందితులుగా గుర్తించి ఆదివారం అరెస్టు చేశామన్నారు. మరో నలుగురి కోసం అన్వేషిస్తున్నామని తెలిపారు. నిందితులకు పలమనేరు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండు విధించగా, మదనపల్లె జైలుకు తరలించారు. మరోవైపు.. ఈ కేసులో నిందితుల్లో ఒకడైన అప్పు(28) పేర్నాంబట్ సమీపంలోని గుండ్లపల్లె వద్ద చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్నేహితులు తనను తీసుకువెళ్లి దోపిడీ కేసులో ఇరికించారని, తన చావుకు వారే కారణమంటూ అతని సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన ఆడియో బయటపడింది.
ఈ వార్తలు కూడా చదవండి..
వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగింపు..
సీతమ్మవారికి తాళి కట్టిన వైసీపీ ఎమ్మెల్యే
For More AP News and Telugu News