EX MLC MVS Sharma : ప్రభుత్వ విద్యను పరిరక్షించుకోవాలి
ABN, Publish Date - Jan 08 , 2025 | 05:16 AM
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను పరిరక్షించుకోవాలని, విద్యారంగాన్ని బతికించుకోవాలని మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ పిలుపునిచ్చారు.
విద్యారంగాన్ని బతికించుకోవాలి
యూటీఎఫ్ స్వర్ణోత్సవాల్లో ఎంవీఎస్ శర్మ
కలెక్టరేట్(కాకినాడ), జనవరి 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను పరిరక్షించుకోవాలని, విద్యారంగాన్ని బతికించుకోవాలని మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ పిలుపునిచ్చారు. కాకినాడ పీఆర్ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న యూటీఎఫ్ స్వర్ణోత్సవ మహాసభల్లో భాగంగా మూడో రోజు ప్రతినిధుల సభ జరిగింది. ఈ సభకు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథి ఎంవీఎస్ శర్మ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో విద్యావ్యవస్థ నాశనమైందన్నారు. మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యావ్యవస్థను సర్వనాశనం చేసిందన్నారు. 3,4,5 తరగతులను హైస్కూల్‌లో కలిపి చాలా తప్పిదం చేసిందన్నారు. ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ రానున్న పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థులను గెలుపించుకోవాలని పిలుపునిచ్చారు.
Updated Date - Jan 08 , 2025 | 05:16 AM