Share News

Passport Office Launch: బెజవాడలో పూర్తిస్థాయి పాస్‌పోర్టు కార్యాలయం

ABN , Publish Date - Apr 09 , 2025 | 05:45 AM

విజయవాడలో పూర్తి స్థాయి పాస్‌పోర్టు కార్యాలయం ప్రారంభమైంది. ఇకపై పాస్‌పోర్టు ముద్రణ, జారీ సేవలు విజయవాడలో అందుబాటులో ఉంటాయి

Passport Office Launch: బెజవాడలో పూర్తిస్థాయి పాస్‌పోర్టు కార్యాలయం

ఇకపై పాస్‌పోర్టు ముద్రణ, జారీ ఇక్కడే.. ప్రారంభించిన కేంద్ర మంత్రి

విజయవాడ(వన్‌టౌన్‌), ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): విజయవాడలోని ప్రాంతీ య పాస్‌పోర్టు కార్యాలయం ఇకనుంచి పూర్తిస్థాయిలో సేవలు అందించనుంది. ఇకపై ఇక్కడే పాస్‌పోర్టు ముద్రణ, జారీ వంటి ఇతర సేవలను దరఖాస్తుదారు లు పొందనున్నారు. ఈ మేరకు స్థానిక బందరు రోడ్డులోని స్టాలిన్‌ భవన్‌లో పాస్‌పోర్టు ప్రాంతీయ కార్యాలయం నూతన భవనాన్ని కేంద్ర మంత్రి కీర్తివర్ధన్‌ సింగ్‌ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలో పాస్‌పోర్టు సేవా కేంద్రం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్నారు. ఇకపై ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయంలోనే ప్రింటింగ్‌, ఇతర అన్ని రకాల సేవలను అందిస్తారని చెప్పారు. సీఎం చంద్రబాబుకు కేంద్ర మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రత్యేక కార్యాలయ నిర్మాణం కోసం 2 ఎకరాలు కేటాయించారని చెప్పారు. మోదీ హయాంలో ఆర్థిక అభివృద్ధి జరిగిందని, చాలా రాష్ర్టాల్లో యువతకు అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. వృద్ధి రేటులో గుజరాత్‌, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ర్టాలు ముందంజలో ఉన్నాయన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ మాట్లాడుతూ ఇప్పటికే విశాఖపట్నంలో ప్రాంతీయ కార్యాలయం ఉందని, ఇప్పుడు విజయవాడలో కూడా ఆ సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. అమరావతిలో కూడా ఒక పాస్‌పోర్టు కార్యాలయం నిర్మాణం జరుగుతుందని తెలిపారు. కాగా, ఇన్నాళ్లూ పాస్‌పోర్టు ముద్రణ, జారీ కోసం విశాఖపట్నం పాస్‌పోర్టు కార్యాలయానికి పంపించేవారు. ఇప్పుడు ఈ సేవలను కూడా విజయవాడలోనే అందుబాటులోకి తీసుకురావడంపై హర్షం వ్యక్తమవుతోంది.

Updated Date - Apr 09 , 2025 | 05:45 AM