Share News

AP Cabinet: ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఆమోదించిన అంశాలు ఏంటంటే..

ABN , Publish Date - Apr 15 , 2025 | 04:13 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భ‌వ‌నాల టెండ‌ర్ల అంశాలపైనా మంత్రులు పూర్తిస్థాయిలో చర్చించి ఆమోదం తెలిపారు. ఎల్ వ‌న్‌గా నిలిచిన సంస్థల‌కు లెట‌ర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చేందుకు క్యాబినెట్ అంగీకరించింది.

AP Cabinet: ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి ఆమోదించిన అంశాలు ఏంటంటే..
AP Cabinet meeting

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ (AP Cabinet) సమావేశం జరిగింది. ఏపీ సచివాలయంలో జరిగిన భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను మంత్రిమండలి చర్చించి ఆమోదించింది. ఎస్సీ వర్గీకరణ (SC Categorization), సీఆర్డీఏ, అసెంబ్లీ, హైకోర్టు నూతన భవనాలు వంటి 24 ప్రధాన అంశాలే అజెండాగా క్యాబినెట్ చర్చలు జరిపింది. ఈ సందర్భంగా పలు అంశాలకు సంబంధించి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.


చర్చించి, ఆమోదించిన అంశాలివే..

జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి వచ్చిన ఎస్సీ వర్గీకరణ నివేదికపై మంత్రివర్గంలో పూర్తిస్థాయి చర్చ జరిగింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్‌ను చంద్రబాబు సర్కార్ నియమించిన సంగతి తెలిసిందే. ఆయన ఇచ్చిన నివేదికను ఏపీ శాసనసభలో ఆమోదించి జాతీయ ఎస్సీ కమిషన్‌కు పంపించారు. దాన్ని పరిశీలించిన జాతీయ ఎస్సీ కమిషన్ తిరిగి ఏపీ ప్రభుత్వానికి నివేదించింది. దీనిపై చర్చించిన మంత్రులు ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ జారీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే సీఆర్డీఏ 46వ అథారిటీ నిర్ణయాలకు సైతం మంత్రివర్గం ఆమోదం తెలిపింది.


మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భ‌వ‌నాల టెండ‌ర్ల అంశాలపైనా మంత్రులు పూర్తిస్థాయిలో చర్చించి ఆమోదం తెలిపారు. ఎల్ వ‌న్‌గా నిలిచిన సంస్థల‌కు లెట‌ర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చేందుకు క్యాబినెట్ అంగీకరించింది. రూ.617 కోట్లతో అసెంబ్లీ బేస్మెంట్ + జీ + 3 + వ్యూయింగ్ ప్లాట్ ఫామ్‌లు + ప‌నోర‌మిక్ వ్యూ (బిల్ట‌ప్ ఏరియా 11.22 ల‌క్షల చ‌ద‌ర‌పు అడుగులు, ఎత్తు 250 మీట‌ర్లు) నిర్మాణానికి టెండ‌ర్ల‌లో ఎల్ వ‌న్‌గా నిలిచిన సంస్థకు ఎల్ఓఏ ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. అలాగే రూ.786 కోట్లతో హైకోర్టు బేస్మెంట్ + జీ + 7 అంతస్తుల్లో (బిల్డప్ ఏరియా 20.32 ల‌క్షల చ‌ద‌ర‌పు అడుగులు ఎత్తు 55 మీట‌ర్లు) నిర్మించేందుకు ఎల్ వ‌న్‌గా నిలిచిన సంస్థకు ఎల్ ఓఏ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.


అలాగే రూ.30,667 కోట్ల పెట్టుబడులతో 16 సంస్థల ఏర్పాటుకు ఇటీవల పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(SIPB) 5వ సమావేశంలో నిర్ణయించారు. వీటి ద్వారా 32,133 మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. కాగా, ఈ పనులకు కూడా ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థ ఏర్పాటుకు చేసేందుకు సైతం క్యాబినెట్ పచ్చజెండా ఊపింది.


ఈ వార్తలు కూడా చదవండి:

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..

AP Liquor Scam: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి షాక్.. ఆ కేసులో నోటీసులు జారీ..

Updated Date - Apr 15 , 2025 | 04:28 PM