Lokesh Competition With Chandrababu: చంద్రబాబుతో ఛాలెంజ్ చేశా.. నిలబెట్టుకున్నా

ABN, Publish Date - Apr 04 , 2025 | 04:31 PM

Lokesh Competition With Chandrababu: ప్రతీ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో పోటీ పడేందుకు ప్రయత్నిస్తానని మంత్రి నారా లోకేష్ అన్నారు. బాబుతో చేసిన ఛాలెంజ్‌ను నిలబెట్టుకున్నట్లు తెలిపారు.

Lokesh Competition With Chandrababu: చంద్రబాబుతో  ఛాలెంజ్ చేశా.. నిలబెట్టుకున్నా
Lokesh Competition With Chandrababu

అమరావతి, ఏప్రిల్ 4: ‘నా పోటీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల నారా లోకేష్ (Minister Nara Lokesh). మన ఇల్లు - మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా నీరుకొండ గ్రామానికి చెందిన 99 మందికి, రత్నాల చెరువుకు చెందిన 199 మందికి శాశ్వత ఇంటి పట్టాలను మంత్రి లోకేష్ పంపిణీ చేవారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రతీ విషయంలో చంద్రబాబుతో (CM Chandrababu Naidu) పోటీపడేందుకు ప్రయత్నిస్తానన్నారు. కుప్పం కంటే ఒక్క ఓటైనా ఎక్కువ వస్తుందని చంద్రబాబుతో చేసిన ఛాలెంజ్ నిలబెట్టుకున్నానని హర్షం వ్యక్తం చేశారు. మంగళగిరి ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించే బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు.


మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని పనిచేస్తానన్నారు. మంగళగిరిలో రానున్న రోజుల్లో కరెంట్ తీగలు కనిపంచవని చెప్పుకొచ్చారు. భూగర్భ విద్యుత్‌తో పాటు, భూగర్భ డ్రైనేజ్, భూగర్భ గ్యాస్ వ్యవస్థను తీసుకొస్తామన్నారు. స్వచ్ఛ భారత్‌లో మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. స్వచ్ఛ మంగళగిరి కోసం ప్రజలందరి సహకారం అవసరమన్నారు. ఎవరూ ఇళ్ల ముందు చెత్త వేయొద్దన్నారు. ఎవరైనా ఇంటి ముందు చెత్త వేస్తే వారితో కలిసి తానూ ఆ చెత్త ఎత్తుతానని చెప్పారు. బహిరంగ మార్కెట్‌లో రూ.వెయ్యి కోట్ల విలువైన ఆస్తిపై శాశ్వత హక్కు మంగళగిరి ప్రజలకు కల్పిస్తున్నామన్నారు.

Pawan Reaction On Pharmacist Suicide: ఫార్మాసిస్ట్ నాగాంజలి ఆత్మహత్యపై పవన్ రియాక్షన్


తనకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే అంత బలమొస్తుందని ఆనాడే చెప్పానని.. తాను ఎక్కడికి వెళ్లినా మంగళగిరి తన గుండెల్లో ఉంటుందని వెల్లడించారు. సూపర్ 6 హామీలు ఓ పద్ధతి ప్రకారం అమలు చేస్తూనే... మంగళగిరిలో ఏ సమస్యా లేకుండా చూసుకుంటామన్నారు. కుప్పంతో పాటు మంగళగిరిని కూడా తెలుగుదేశం కంచుకోటగా మారుస్తా అని చంద్రబాబుకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. మంగళగిరి పేదలకు ఇంటి పట్టాల పంపిణీ రెండున్నర దశాబ్దాల కల అని చెప్పుకొచ్చారు. ఓడిన చోటే గెలిచి చూపాలని మంగళగిరిపై ప్రత్యేక దృష్టి సారించి 26 సంక్షేమ కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉండగా అమలు చేశానని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.


కాగా.. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా రెండో రోజు శాశ్వత ఇంటి పట్టాలను మంత్రి లోకేష్ అందజేశారు. యర్రబాలెం గ్రామానికి చెందిన 248 మందికి శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. అలాగే మధ్యాహ్నం నీరుకొండ గ్రామానికి చెందిన 99మందికి, రత్నాల చెరువు కు చెందిన - 199 మందికి శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఈరోజు మొత్తం 546 మంది లబ్దిదారులకు శాశ్వత ఇంటి పట్టాలను ఉచితంగా అందజేశారు. సొంత ఖర్చులతో బట్టలు పెట్టి మరీ లబ్ధిదారులకు ఇంటి పట్టాలను మంత్రి లోకేష్ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి

Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే

Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 04 , 2025 | 05:12 PM