Share News

మూగజీవాలతో రాజకీయం చేయడం తగదు

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:00 AM

మూగ జీవులను అడ్డం పెట్టుకొని వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి రాజకీయాలు చేయడం తగదని జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి భూపేష్‌రెడ్డి పేర్కొన్నారు.

మూగజీవాలతో రాజకీయం చేయడం తగదు
సమావేశంలో మాట్లాడుతున్న టీడీపీ ఇనచార్జి భూపేష్‌రెడ్డి

ముద్దనూరు ఏప్రిల్‌15(ఆంధ్రజ్యోతి):మూగ జీవులను అడ్డం పెట్టుకొని వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి రాజకీయాలు చేయడం తగదని జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి భూపేష్‌రెడ్డి పేర్కొన్నారు. ముద్దనూరులోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో భూపేష్‌రెడ్డి మాట్లాడుతూ...టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ గోసంరక్షణశాలలో గోవులు మృతి చెందాయంటూ వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి మార్ఫింగ్‌ గోవుల కళేబరాల చిత్రాలతో వెంకటేశ్వరస్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ఆరోపనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్‌గా కరుణాకర్‌రెడ్డి ఉన్నప్పుడు ఆయన చేసిన అవినీతి, అక్రమాలు అందరికీ తెలిసిందేనన్నారు.నిరాధార ఆరోపణలు చేసిన కరుణాకర్‌రెడ్డి పై టీటీడీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. అంతకు ముందు అన్ని గ్రామాల టీడీపీ నాయకులు, కార్యకర్తలతో భూపేష్‌రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు. కార్యక్రమంలో ఎర్రగుంట్ల మార్కెట్‌ యార్డు చైర్మన్‌ నాగరాజు, మండల టీడీపీ అధ్యక్షుడు చింతా శివరామిరెడ్డి, నాయకులు రంగారెడ్డి, కేశవరెడ్డి, జగదీశ్వరరెడ్డి, శేఖర్‌నాయుడు, ఆది, శ్రీకాంత్‌, అమీర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 12:00 AM