Narsannapeta Pollution Case: కోర్టుకు రండి
ABN, Publish Date - Apr 06 , 2025 | 04:04 AM
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పరిధిలో కేరళ టైర్స్’\ సంస్థ వాయికాలుష్యానికి కారణమవుతుండగా, అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ విషయంలో అధికారులకు లిఖిత పూర్వక వివరాలు సమర్పించమని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణలో హైకోర్టు, పీసీబీ మెంబర్ సెక్రెటరీ, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ను దాఖలుచేసిన వ్యవహారంపై విచారణ జరిపింది

పీసీబీ మెంబర్ సెక్రెటరీ, శ్రీకాకుళం కలెక్టర్‌కు హైకోర్టు ఆదేశం
లిఖిత పూర్వకంగా వివరాలను సమర్పించకపోవడంపై అసంతృప్తి
వీడియో కాన్ఫరెన్స్ హాజరుకు అనుమతి
అమరావతి, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): ఏపీ కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) బోర్డు సభ్య కార్యదర్శి, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌కు హైకోర్టు షాక్ ఇచ్చింది. శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట పరిధిలో నివాసప్రాంతంలో వాయికాలుష్యానికి కారణమవుతున్న ‘కేరళ టైర్స్’ సంస్థపై అధికారులు చర్యలు తీసుకోవడంలేదని పేర్కొంటూ దాఖలైన వ్యాజ్యంలో లిఖిత పూర్వక వివరాలు సమర్పించాలని ధర్మాసనం గతంలో ఆదేశించింది. అయితే.. ఈ ఉత్తర్వులను అధికారులు నిర్లక్ష్యం చేయడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తదుపరి విచారణలో తమ ముందు హాజరుకావాలని ఇద్దరు ఉన్నతాధికారులకు స్పష్టం చేసింది. అయితే, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు వెసులుబాటు ఇచ్చింది. విచారణను ఈ నెల 7కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిల్హరి, జస్టిస్ కుంచం మహేశ్వరరావుతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది.
నరసన్నపేట పరిధిలోని నివాస ప్రాంతంలో అనధికారికంగా రబ్బర్ టైర్లు, ట్యూబ్‌లు రీబటనింగ్, రీబిల్డింగ్ చేస్తూ కేరళ టైర్స్ పర్యావరణాన్ని కాలుష్యం చేస్తోందని గరీబ్ గైడ్ వలంటరీ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ జి. భార్గవి, ఉపాధ్యాయుడు పి. అప్పారావు ఫిర్యాదు చేశారు. అయితే.. దీనిపై అధికారులు నివేదిక సమర్పించినా.. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంలేదని పేర్కొంటూ వారు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా ఈ వ్యవహారంపై లిఖిత పూర్వక వివరాలు సమర్పించాలని అధికారులను కోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ ఈ నెల 2న మరోసారి విచారణకు రాగా ప్రభుత్వ న్యాయవాదులు స్పందిస్తూ లిఖిత పూర్వక వివరాలు అందలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం తదుపరి విచారణలో తమ ముందు హాజరుకావాలని పీసీబీ మెంబర్ సెక్రెటరీ, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.
ఇవి కూడా చదవండి
YSRCP Leaders Cruelty: వైసీపీ నేతల అరాచకం.. కన్నీరు పెట్టిస్తున్న వృద్ధురాలి వీడియో
Tiruvuru Politics: తిరువూరులో రసవత్తరంగా రాజకీయం
Read Latest AP News And Telugu News
Updated Date - Apr 06 , 2025 | 04:07 AM