Share News

AP Weather Update: రైతులకు బిగ్ అలర్ట్.. ఏపీలో వానలు.. వరుసగా మూడు రోజులు

ABN , Publish Date - Apr 14 , 2025 | 04:00 PM

AP Weather Update: వర్షాలపై అమరావతి వాతావరణ కేంద్రం బిగ్ అప్డేట్ ఇచ్చింది. రాగల మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడనున్నట్లు వెల్లడించింది.

AP Weather Update: రైతులకు బిగ్ అలర్ట్..  ఏపీలో వానలు.. వరుసగా మూడు రోజులు
AP Weather Update

అమరావతి, ఏప్రిల్ 14: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) అకాల వర్షాలు రైతులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోని వాతావరణంలో మార్పులు వెనువెంటనే చోటు చేసుకుంటున్నాయి. అప్పుడే ఎండగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. ఉన్నట్టుండి వర్షాలు పడుతున్నాయి. దీంతో వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియక ప్రజలు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా వర్షాలపై అమరావతి వాతావరణ కేంద్రం లేటెస్ట్ అప్డేట్ ఇచ్చేసింది. వచ్చే మూడు రోజుల పాటు ఏపీలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు (Rain Alerst) పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించారు. కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడనుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షాలు పడే ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.


పశ్చిమ రాజస్థాన్ నుంచి తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడ, అంతర్గత కర్ణటాక, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. ఇది ఈశాన్య మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాలలో ఉన్న అపరిత ఆవర్తనం నుంచి దక్షిణ తీర ప్రాంతం ఒడిశా వరకు ఛత్తీస్‌గఢ్ మీదుగా సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. అలాగే నిన్నటి నుంచి కోస్తా ఆంధ్ర మధ్య ప్రాంతాలు, యానం, పరిసన ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీన పడింది. వీటి ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Anna Lezhneva Donation: కుమారుడి పేరుపై అన్నా కొణిదెల భారీ విరాళం


ఏయే ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే..

ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్: నేటి నుంచి మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఈరోజు 40 -50 కి.మీ, రేపు 30-40 కి.మీ, ఎల్లుండి 30-40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్: ఇక్కడ కూడా ఈరోజు (సోమవారం) నుంచి రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు పడనున్నాయి. ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. అలాగే ఉరుములు, మెరుపులతో కూడి బలమైన ఈదురు గాలులు వచే ఛాన్స్ ఉంది. ఈదురు గాలులు నేడు గంటకు 40 -50 కి.మీ, రేపు (ఏప్రిల్ 15) గంటకు 30-40 కి.మీ, ఎల్లుండి (ఏప్రిల్ 16)న గంటకు 30-40 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది.


రాయలసీమ: ఈ ప్రాంతంలో కూడా రానున్న మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి నెలకొననుందని వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు (సోమవారం), రేపు (మంగళవారం), ఎల్లుండి (బుధవారం) మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడనున్నాయి. పలు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు పడనున్నాయి. అలాగే ఈ మూడు రోజులు గంటకు 30-40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.


ఇవి కూడా చదవండి

Unseasonal Rains Damage: చేతికొచ్చిన పంట నేలరాలింది.. అన్నదాత కంట కన్నీరు

Falaknuma Crime News: వివాహమైన మూడు రోజులకే రౌడీషీటర్ దారుణ హత్య.. ఏం జరిగిందంటే

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 14 , 2025 | 05:38 PM