Good News: ఏపీ ఉద్యోగులకు పండుగలాంటి వార్త
ABN, Publish Date - Mar 24 , 2025 | 01:02 PM
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఎంప్లాయిస్‌కు రావలసిన GLI, GPF బకాయిలను విడుదల చేసింది. నేరుగా నిధులు వారి అకౌంట్లలో జమ అవుతున్నాయి. బకాయిలు అకౌంట్లలో జమ అవుతున్నట్లు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నేతలు ధృవీకరించారు.

అమరావతి: ఏపీ కూటమి ప్రభుత్వం (AP Kutami Govt.) ఉద్యోగులకు (Employees) పండుగలాంటి వార్త (Good News) అందించింది. ఉద్యోగుల బకాయిలను వారి ఖాతాల్లో జమ చేస్తోంది. ఎంప్లాయిస్ GLI, GPF బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. సోమవారం ఉదయం 11.30 గంటల నుంచి ఉద్యోగుల ఖాతాల్లో బకాయిలు పడుతున్నాయి. మొత్తం రూ. 6 వేల 200 కోట్లు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిధులు విడుదల అవుతున్నాయి. నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి మంగళవారం లేదా బుధవారం సాయంత్రానికి పూర్తి స్థాయిలో నిధులు విడుదల అవుతాయని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. బకాయిలు జమ అవుతున్నాయని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నేతలు (AP NGO Association Leaders) ఈ మేరకు ధృవీకరించారు.
Also Read..: ABN Live..: విశాఖలో ఐపీఎల్ క్రికెట్ సమరం
రూ. 6,200 కోట్లు విడుదల..
కాగా రాష్ట్రంలోని ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల విడుదలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ. 6,200 కోట్లు చెల్లించాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల ఖాతాల్లో సోమవారం నిధులు జమ అవుతున్నాయి. సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఏఐ కింద ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ రూ.6,200 కోట్లు విడుదల చేసింది. కాగా జనవరిలోనూ రూ.1,033 కోట్ల బకాయిలను ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం చెల్లించిన సంగతి తెలిసిందే.
ఏపీ జేఏసీ నేతల హర్షం..
ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్ల పెండింగ్ బకాయిలకు సంబంధించి రూ.6,200 కోట్లు విడుదల చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలివ్వడంపై ఏపీ జేఏసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
మంచి శకునాల్లో మొదటిది ఏంటంటే..
For More AP News and Telugu News
Updated Date - Mar 24 , 2025 | 01:22 PM