AP Inter Results: సరికొత్తగా ఇంటర్ ఫలితాలు.. వాట్సాప్‌లో కూడా..
ABN , Publish Date - Apr 12 , 2025 | 11:44 AM
AP Inter Results: మొదటి సంవత్సరం విద్యార్థులు 70 శాతం రెండో ఏడాది విద్యార్థులు 83 శాతం ఉత్తీర్ణత నమోదైందని, ప్రభుత్వ.. ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలలో మెరుగుదల ప్రత్యేకంగా కనిపించిందని మంత్రి లోకేష్ అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల (GJCs)లో రెండో సంవత్సరం ఉత్తీర్ణత శాతం 69 శాతంగా నమోదు కాగా, ఇది గత 10 ఏళ్లలో అత్యధికమని అన్నారు.

అమారవతి: ఏపీలో ఇంటర్ మొదటి, ద్వితీయ ఫరీక్ష ఫలితాలు విడుదల (Intermediate exam Results) అయ్యాయి. శనివారం ఉదయం 11 గంటలకు విద్య,ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) సోషల్ మీడియా (Social Media) వేదికగా ఎక్స్ (X)లో ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను ఆన్‌లైన్‌లో https://resultsbie.ap.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. అలాగే, మన మిత్ర వాట్సాప్ (Mana Mitra WhatsApp) నంబర్ 9552300009కి ‘Hi’ అని మెసేజ్ పంపితే రెండు నిముషాల్లో ఫలితాలను పొందవచ్చునని చెప్పారు. ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో గత పదేళ్లలో అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైనందుకు ఆనందంగా ఉందని మంత్రి లోకేష్ అన్నారు.
Also Read..: ఇంటర్ ఫలితాలు.. విడుదల చేసిన మంత్రి లోకేష్
సరికొత్తగా ఇంటర్ ఫలితాలు..
అయితే ఈసారి ప్రభుత్వం సరికొత్తగా ఇంటర్, మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు విడుదల చేసింది. వాట్సాప్ గవర్నెన్స్(WhatsApp governance)లో హాయ్ (hi) అని చెప్పడం ద్వారా విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చు. గతంలో ప్రభుత్వాలు పరీక్షా ఫలితాల విడుదల సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ ఫలితాలు విడుదల చేసేవి. ఈసారి రొటీన్‌కు భిన్నంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వెబ్‌సైట్‌లో http://resultsbie.ap.gov.in ఫలితాలు ఉంచుతామని ప్రభుత్వం వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రారంభించిన వాట్సాప్ గవర్నెన్స్‌లో విద్యార్థులు ఇంటర్ ఫలితాలు చూసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు. వాట్సాప్ గవర్నెన్స్ లో మనమిత్ర చాట్‌లో హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు క్షణాల్లో ఫలితాలు కళ్ళముందు కనిపించేటట్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఫలితాలను తెలుసుకునేందుకు హాల్ టికెట్ నెంబర్ , డేట్ అఫ్ బర్త్ ఉంటే చాలు. మన మిత్ర వాట్స్ యాప్ నంబర్‌కు 9552300009లో ‘hi’ అని కొట్టి కూడా ఫలితాలు తెలుసుకోవచ్చునని మంత్రి లోకేష్ చెప్పారు. అందరికి మంచి ఫలితాలు రావాలని కోరుకుంటూ లోకేష్ బెస్ట్ విషెస్ చెప్పారు.
అత్యధిక ఉత్తర్ణత శాతం
మొదటి సంవత్సరం విద్యార్థులు 70 శాతం రెండో ఏడాది విద్యార్థులు 83 శాతం ఉత్తీర్ణత నమోదైందని, ప్రభుత్వ.. ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలలో మెరుగుదల ప్రత్యేకంగా కనిపించిందని మంత్రి లోకేష్ అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల (GJCs)లో రెండో సంవత్సరం ఉత్తీర్ణత శాతం 69 శాతంగా నమోదు కాగా, ఇది గత 10 ఏళ్లలో అత్యధికమని అన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 47 శాతంగా ఉంది, ఇది గత పదేళ్లలో రెండవ అత్యధిక శాతమని అన్నారు. ఈ విజయానికి విద్యార్థులు, జూనియర్ అధ్యాపకులు, విద్యా పురోగతికి కృషి చేసిన ప్రతి ఒక్కరి కఠినమైన శ్రమే కారణమని అన్నారు. ఈసారి ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థులు నిరాశ చెందవద్దని.. దీనిని ఒక అడుగుగా భావించి, తీవ్రంగా కృషి చేసి, మరింత బలంగా తిరిగి రావాలని కోరుకుంటున్నామన్నారు. ప్రతి విద్యార్థికి శుభాకాంక్షలని.. మీరు నిరంతరం నేర్చుకుంటూ, ఎదుగుతూ, విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నానని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
KCR: ఒక ప్రపంచ పర్యావరణ వేత్తను కోల్పోయాం...
ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణం..
For More AP News and Telugu News