Vamsi in police custody: రెండో రోజు వంశీ విచారణ.. కీలక అంశాలపై ప్రశ్నలు
ABN , Publish Date - Feb 26 , 2025 | 11:14 AM
Vamsi: మాజీ ఎమ్మెల్యే వల్లభవనేని వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. తొలిరోజు రెండున్నర గంటల పాటే విచారణ సాగగా.. రెండో రోజు కీలక అంశాలపై వంశీని ప్రశ్నించనున్నారు పోలీసులు.

విజయవాడ, ఫిబ్రవరి 26: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడిలో కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్‌ను బెదిరించిన కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని (Former MLA Vallabhaneni Vamsi) పోలీసులు రెండో రోజు కస్టడీలోకి తీసుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు వంశీని పోలీసులు విచారించనున్నారు. ఈరోజు (బుధవారం) ఉదయం 10 గంటల ముందే సబ్ జైలుకు చేరుకున్న కాప్స్.. వంశీని తీసుకుని అక్కడి నుంచి నేరుగా వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు తర్వాత విచారించేందుకు వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తీసుకొచ్చారు. వంశీని విచారించేందుకు ఏసీపీలు, సీఐలు, ఇతర అధికారులు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు
రెండవ రోజు వంశీని పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా ప్రశ్నించనున్నారు. సత్యవర్ధన్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వంశీని ప్రశ్నించనున్నట్టు తెలుస్తోంది. టెక్నికల్ ఎవిడెన్స్‌ల ఆధారంగా వంశీని పోలీసులు విచారించనున్నారు. తొలిరోజు రెండున్నర గంటల పాటు విచారణ జరుగగా.. పోలీసులు అడిగిన ప్రశ్నల్లో కొన్నింటిని సమాధానాలు ఇచ్చిన వంశీ... మరికొన్నింటిని దాట వేశారు. వంశీతో పాటు ఏ7 లక్ష్మీ పతి, ఏ8 శివరామకృష్ణప్రసాద్‌ను కూడా పోలీసులు విచారిస్తున్నారు.
ఈ శివుడిని దర్శించుకుంటే పిల్లలు పుడతారంట..
కాగా... సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరించిన వ్యవహారంలో పదిరోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. మూడు రోజుల పాటు వంశీని విచారించేందుకు కోర్టు అనుమతించింది. నిన్నటి (మంగళవారం) నుంచి వంశీ విచారణ ప్రారంభమవగా.. రేపటితో (గురువారం) ముగియనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేసుకోవచ్చని కోర్టు ఆదేశించింది. అలాగే విచారణ సమయంలో వంశీ తరపు న్యాయవాదలు నాలుగు సార్లు వంశీతో మాట్లాడే అవకాశాన్ని కూడా కల్పించింది కోర్టు. ఈ నేపథ్యంలో నిన్న తొలిరోజు కావడంతో పాటు రిమాండ్ ముగియడంతో జైలులోనే వర్చువల్ విధానంలో వంశీని కోర్టులో పోలీసులు హాజరుపర్చారు. దీంతో వంశీకి మరో 14 రోజుల పాటు అంటే మార్చి 11 వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది.
అనంతరం 11 గంటల తర్వాత జైలు నుంచి పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ప్రభుత్వాస్పత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించిన అనంతరం విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి వంశీని పోలీసులు విచారించారు. దాదాపు మధ్యాహ్నం వరకు కాలయాపన జరగడంతో కేవలం రెండున్నర గంటలు మాత్రమే వంశీని పోలీసులు విచారించే అవకాశం వచ్చింది. ఈ రెండున్నర గంటల విచారణలో కూడా పోలీసులు అడిగిన అనేక ప్రశ్నలకు తనకు గుర్తులేదు, మర్చిపోయాను అనే విధంగా మాజీ ఎమ్మెల్యే సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని ప్రశ్నలకు మాత్రం వంశీ సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.
ప్రధానంగా వంశీని అరెస్ట్ చేసే సమయంలో అతడి ఫోన్ కనిపించకుండా పోయింది. దీంతో ఆ ఫోన్ సమాచారాన్ని అడిగినప్పటికీ వంశీ సరైన సమాధానం చెప్పన్నట్లు తెలుస్తోంది. అరెస్ట్‌కు ముందు రోజు నుంచే తన ఫోన్ కనిపించడం లేదని, తనకు తెలీదని సమాధానం ఇచ్చినట్లు సమాచారం. అలాగే సత్యవర్ధన్ కిడ్నాప్‌కు సంబంధించి ఎవరెవరితో మాట్లాడారని వంశీని పోలీసులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. పలు సాక్షాలను ముందుర పెట్టి మరీ వంశీని విచారించారు పోలీసులు.
ఇవి కూడా చదవండి...
ఆ ఎనిమిది మంది సురక్షితంగా తిరిగి రావాలంటూ...
Read Latest AP News And Telugu news