Lokesh: సాక్షి తప్పుడు రాతలపై మంత్రి లోకేష్ స్పందన..

ABN, Publish Date - Mar 05 , 2025 | 10:48 AM

చట్టసభల్లో ఇది తనకు రెండో అవకాశమని, తొలిసారి శాసనసభకు వచ్చానని, వైసీపీ సభ్యులు బాధ్యత లేకుండా గవర్నర్ ప్రసంగాన్ని డిస్ట్రబ్ చేసి వెళ్లారని మంత్రి లోకేష్ అన్నారు. గతంలో తాము నిరసన తెలియజేసినప్పుడు బెంచిలవద్దే ఉండి ధర్నా చేశామని, పోడియం వద్దకు రాలేదని.. మేం ఎప్పుడూ లక్ష్మణరేఖ దాటలేదని అన్నారు.

Lokesh: సాక్షి తప్పుడు రాతలపై మంత్రి లోకేష్ స్పందన..
Minister Lokesh

అమరావతి: ఎవరు ఎక్కడ ఉండాలో నిర్ణయించేది ప్రజలేనని, సాక్షి పత్రిక (Sakshi News Paper)లో స్పీకర్‌ (Speaker)పై తప్పుడు రాతలు బాధాకరం విద్య, ఐటిశాఖల మంత్రి నారా లోకేష్ (Minister Lokesh) అన్నారు. చట్టసభలు చూస్తూ పెరిగినవాడినని.. చిన్నవయసులో చట్టసభలను చూశానని... అప్పట్లో వ్యక్తిగత దూషణలు ఉండేవి కాదని.. ప్రజలకు ఏమి కావాలో దానిపైనే చర్చలు జరిగేవని లోకేష్ అన్నారు. వైఎస్సార్‌సీపీ (YSRCP)కి ప్రతిపక్ష హోదా అంశంలో సాక్షి తప్పుడు రాతలపై స్పందించిన మంత్రి లోకేష్ బుధవారం శాసనసభలో మాట్లాడారు...

Read More..:

శిరీష మృతి కేసులో విస్తుపోయే విషయాలు..


గవర్నర్ స్పీచ్‌ను డిస్ట్రబ్ చేశారు..

చట్టసభల్లో ఇది తనకు రెండో అవకాశమని, తొలిసారి శాసనసభకు వచ్చానని, వైసీపీ సభ్యులు బాధ్యత లేకుండా గవర్నర్ ప్రసంగాన్ని డిస్ట్రబ్ చేసి వెళ్లారని మంత్రి లోకేష్ అన్నారు. గతంలో తాము నిరసన తెలియజేసినప్పుడు బెంచిలవద్దే ఉండి ధర్నా చేశామని, పోడియం వద్దకు రాలేదని.. మేం ఎప్పుడూ లక్ష్మణరేఖ దాటలేదని అన్నారు. తాను అసెంబ్లీలో కొత్త మెంబర్‌నని, పార్లమెంటులోని 121సి నిబంధన ప్రకారం ప్రతిపక్ష హోదాకు టోటల్ నెంబర్‌లో 1/10 ఉండాలని స్పష్టంగా ఉందని ఆయన అన్నారు. అసెంబ్లీ కండీషన్స్ ఫర్ రికగ్నిషన్‌లో కూడా ఈ విషయం పొందుపర్చబడి ఉందన్నారు.


ప్రభుత్వం కక్షలకు పాల్పడలేదు..

వైఎస్ జగన్మోహన్ రెడ్డి 13, జూన్, 2019న అసెంబ్లీలో మాట్లాడుతూ... చంద్రబాబుకు 23 మంది సభ్యులు ఉన్నారని, ఐదుగురిని లాగేస్తే ఆయనకు ప్రతిపక్ష స్టేటస్ కూడా ఉండదని సభ సాక్షిగా వ్యాఖ్యానించారని ఈ సందర్బంగా మంత్రి లోకేష్ గుర్తు చేశారు. సభాపతిపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం హౌస్ పరువు తగ్గిస్తోందని.. సాక్షి పత్రికలో తప్పుడు రాతలు బాధాకరమని ఆయన అన్నారు. ఎవరు ఎక్కడ ఉండాలో ప్రజలు నిర్ణయిస్తారని లోకేష్ మరోసారి చెప్పారు. ప్రజాప్రతినిధులుగా ప్రజలు తరపున పోరాడాల్సి ఉందని, జగన్మోహన్ రెడ్డికి ఉప ముఖ్యమంత్రి కంటే ఎక్కువగా జడ్ ప్లస్ పాయింట్స్ అని సెక్యూరిటీ ఇచ్చామని తెలిపారు. ప్రభుత్వం ఎక్కడా వ్యక్తిగత కక్షలకు వెళ్లడం లేదని, చట్టాన్ని ఉల్లంఘించడం, దానిని హౌస్‌పై రుద్దడం సరికాదన్నారు. ఎవరు అధికారంలో ఉన్నా ఇది కరెక్టు కాదన్నారు. చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు జరిగితేనే ప్రజలకు మేలు జరుగుతుందని మంత్రి లోకేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సింగర్ కల్పన భర్తను విచారిస్తున్న పోలీసులు

మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ బలప్రదర్శన..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Mar 05 , 2025 | 10:48 AM