Atrocities.. ఎన్టీఆర్ జిల్లా: విద్యార్థినిపై అమానుషం..

ABN, Publish Date - Feb 09 , 2025 | 01:54 PM

స్నేహం పేరుతో ఓ యువకుడు యువతికి దగ్గరయ్యాడు. మాయమాటలు చెప్పి ఆమెను నమ్మించాడు. అదును చూసి.. ఆ యువతిని అత్యాచారం చేసి.. ఆపై నగ్నంగా ఫొటోలు తీసి బెదిరింపులకు దిగారు. వారి వేధింపులు తాళలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Atrocities.. ఎన్టీఆర్ జిల్లా: విద్యార్థినిపై అమానుషం..
Engineering Student

ఎన్టీఆర్ జిల్లా: కంచికచర్లలో (Kanchikacherla) దారుణం (Atrocities) జరిగింది. పరిటాలలో ఇంజనీరింగ్ కళాశాల (Engineering College)లో బీటెక్ (B.Tech) చదువుతున్న విద్యార్థినిని యువకుడు మాయమాటలతో లోబరుచుకుని అత్యాచారం చేశాడు. ఆమె న్యూడ్ ఫోటోలు (Nude photos) తీసి ఇద్దరు స్నేహితులకు చూపించాడు. అలాగే మరో ఇద్దరికి చూపించాడు. ఈ క్రమంలో యవతికి ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు. వారి వేధింపులు తాళలేక విద్యార్థిని కంచికచర్ల పోలీస్ స్టేషన్‌ (Police Station)లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ వార్త కూడా చదవండి..

ఆ పేరు మార్చకుంటే కేంద్రం నిధులు ఇవ్వదు..


ఈ ఘటనపై స్పందించిన ఏసీపీ..

కంచికచర్లలోని పరిటాల ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం చేసి , న్యూడ్ ఫోటోలు తీసిన దానిపై నందిగామ ఏసీపీ తిలక్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిటాల ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారం జరిగింది వాస్తవమేనన్నారు. పరిటాలకు చెందిన పెయింటింగ్ పనిచేస్తున్న షేక్ హుస్సేన్ ప్రేమ పేరిట బీటెక్ విద్యార్థిని లోపర్చుకున్నాడని, తన స్నేహితుడు సిద్దు ఉంటున్న రూంలో ఆమెను ఉంచి హుస్సేన్ బయటకు వెళ్లి పోయాడు. అతను బయటికి వెళ్లిపోయిన తర్వాత రూమ్‌లో సిద్దు విద్యార్థినిపై అత్యాచారం చేశాడన్నారు.


ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని గుర్తించాం..

ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని గుర్తించామని.. ఈ ఘటనలో ప్రథమ ముద్దాయి సిద్దు కాగా, రెండో ముద్దాయి విద్యార్థిని లవర్ హుస్సేన్.. అతనికి సహకరించిన ప్రభుదాస్‌ను మూడో ముద్దాయి కింద కేసు నమోదు చేశామని ఏసీపీ తిలక్ తెలిపారు. సిద్దును అదుపులో తీసుకుని విచారిస్తున్నామని, న్యూడ్ ఫోటోలు తీశారా.. లేదా అన్నదానిపై విచారణలో తేలాల్సి ఉందని తిలక్ అన్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

అనంతపురంలో ఖాకీ సినిమా తరహా ఘటన

వైఎస్సార్‌సీపీకి షాకులు మీద షాకులు..

ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్.. 12 మంది మావోయిస్టుల మృతి

పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ.. యువకుడు మృతి..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Feb 09 , 2025 | 01:54 PM