Share News

Fog Effect: గన్నవరం ఎయిర్‌పోర్టుకు రావలసిన పలు విమానాలు ఆలస్యం

ABN , Publish Date - Jan 23 , 2025 | 08:22 AM

దేశరాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతంలో చలి అధికమైంది. ఈ నేపథ్యంలో గన్నవరంలో భారీగా పొగమంచు కురుస్తోంది. దీంతో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. గన్నవరం హైవేను పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 Fog Effect: గన్నవరం ఎయిర్‌పోర్టుకు  రావలసిన పలు విమానాలు ఆలస్యం

కృష్ణా జిల్లా: గన్నవరం (Gannavaram)లో భారీగా పొగమంచు (Fog Effect) కురుస్తోంది. దీంతో ఎయిర్ పోర్టు (Air Fort)కు రావాలసిన పలు విమానాలు (Several Flights) ఆలస్యంగా (Delayed) వస్తున్నాయి. పొగ మంచు కారణంగా పలు విమానాలు రద్దు కాగా హైదరబాద్, చెన్నై, బెంగళూరు విమానాల సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. గన్నవరం హైవేను పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విమానాల ఆలస్యంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని రోజులుగా ఉత్తరాది రాష్ట్రాల్లో చలితీవ్రత పెరుగడంతో రెండు రోజులుగా పొగమంచు వాతావరణాన్ని కమ్మేస్తోంది.

ఈ వార్త కూడా చదవండి..

అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయండి


కాగా దేశరాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతంలో చలి అధికమైంది. బుధవారం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 9.3 డిగ్రీలుగా నమోదైంది. ఈ సీజన్‌లో సాధారణం కంటే 1.8 శాతం ఎక్కువగా ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం (ఐఎండి) తెలిపింది. పొగమంచు కారణంగా రాజధానిలోని పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ నుండి బయలుదేరే పలు రైళ్లు ఆలస్యంగా బయలుదేరినట్లు రైల్వే అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చంద్రబాబుతో భేటీలో బిల్ గేట్స్ రియాక్షన్..

భార్యను ముక్కలు ముక్కలుగా నరికి, ఉడకబెట్టి..

సీఎం వచ్చే వరకు ఆపండి..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 23 , 2025 | 08:22 AM