Kolikapudi Srinivas: అదే నేను చేసిన తప్పా.. నన్ను టార్గెట్ చేశారు
ABN, Publish Date - Jan 20 , 2025 | 02:29 PM
Kolikapudi Srinivas: ‘‘ఆ వైసీపీ కుటుంబ సభ్యులు నన్ను టార్గెట్ చేశారు.. ఆత్మహత్యాయత్నం చేసి వైసీపీ కుటుంబ సభ్యులు రాద్ధాంతం చేస్తున్నారు. ఆ వైసీపీ కుటుంబం 2013లో చంద్రబాబుపై నీళ్ల బాటిల్ వేశారు. మాజీ మంత్రి జవహర్, మాజీ ఎమ్మెల్యే స్వామి దాస్‌పై గతంలో ఆ కుటుంబసభ్యులే దాడులు చేసి వాహనాలు పగలగొట్టారు’’ అని కొలికపూడి శ్రీనివాస్ తెలిపారు.

అమరావతి, జనవరి 20: టీడీపీ క్రమశిక్షణ సంఘం కమిటీ ముందు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ (Tiruvuru MLA Kolikapudi Srinivas) భేటీ ముగిసింది. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 11న టీడీపీ కార్యకర్త మృతి చెందితే పరామర్శకు గోపాలపురం గ్రామం వెళ్లానని.. అక్కడ వైసీపీకి చెందినవారు ప్రభుత్వం వేసిన సిమెంట్ రోడ్డుపై ముళ్ళ కంచే అడ్డంగా వేశారని తెలిపారు. అక్కడ స్థానికులు కూడా కంచె దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. అందుకే తాను కంచెను తొలగించినట్లు చెప్పారు. తాను కంచెను తొలగించానని ఆ వైసీపీ కుటుంబ సభ్యులు తనను టార్గెట్ చేశారని.. ఆత్మహత్యాయత్నం చేసి వైసీపీ కుటుంబ సభ్యులు రాద్ధాంతం చేస్తున్నారని తెలిపారు.
పంచాయతీ తీర్మానంతోనే ఆ సీసీ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆ వైసీపీ కుటుంబం 2013లో చంద్రబాబుపై నీళ్ల బాటిల్ వేశారని చెప్పారు. మాజీ మంత్రి జవహర్, మాజీ ఎమ్మెల్యే స్వామి దాస్‌పై గతంలో ఆ కుటుంబసభ్యులే దాడులు చేసి వాహనాలు పగలగొట్టారని గుర్తుచేశారు. ఈరోజు క్రమశిక్షణ కమిటీ ముందు ఆరోజు జరిగిన పరిణామాలన్నీ వివరించినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో ఒక రకంగా వస్తుందని.. అక్కడ జరిగిన వాస్తవం వేరన్నారు. వాస్తవాలు ఏంటనేది తిరువూరు ప్రజలు అడిగితే తెలుస్తుందన్నారు. ‘‘రోడ్డుపై అడ్డంగా ఉన్న ముళ్లకంచెను తీయడం నేను చేసిన తప్పా. క్రమశిక్షణ సంఘం సభ్యులకు రాతపూర్వకంగానూ, నేరుగాను కలిసి చెప్పాను’’ అని కొలికపూడి శ్రీనివాస్ వెల్లడించారు.
ప్రెసిడెంట్‌గా ట్రంప్.. ఈ 7 సీక్రెట్స్ తెలుసా..
ఎమ్మెల్యే అన్నీ చెప్పారు: కొనకళ్ల నారాయణ
తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి క్రమశిక్షణ కమిటీ ముందుకు వచ్చి ఆ రోజు ఏం జరిగిందనేది చెప్పారని టీడీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు కొనకళ్ల నారాయణ తెలిపారు. గోపాలపురం మహిళ ఆత్మహత్యాయత్నం ఘటనలో వివరాలు అడిగామన్నారు. ఎమ్మెల్యే చెప్పిన వివరాలన్నీ హైకమాండ్‌కు పంపిస్తామన్నారు. ‘‘ఈ వివాదంలో నా ప్రమేయం లేదని ఎమ్మెల్యే కొలికపూడి చెప్పారు. వైసీపీ వాళ్లు కంచె వేయడం వల్లే నేను ఆ కంచెను తొలగించానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు’’ అని తెలిపారు.
ఎవరైనా ఒకటే: వర్ల రామయ్య
టీడీపీలో ఎవరైనా క్రమశిక్షణ పాటించాలని టీడీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు వర్ల రామయ్య స్పష్టం చేశారు. కార్యకర్త అయినా, ఎమ్మెల్యే అయినా టీడీపీలో ఒకటే అన్నారు. తిరువూరు ఎమ్మెల్యే పార్టీ లైన్ దాటుతున్నారని తెలుస్తోందని.. ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహారశైలి సరిగా లేదని ఈ రోజు క్రమశిక్షణ కమిటీ సభ్యులు అందరూ ఆయనకు చెప్పామన్నారు. కొలికపూడి వ్యవహారంలో సీఎం సీరియస్‌గా ఉన్నారని ఈరోజు ఎమ్మెల్యేకు చెప్పినట్లు తెలిపారు. ఈ ఏడు నెలల్లో రెండు ఘటనల్లో తిరువూరు ఎమ్మెల్యే రెండు సార్లు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారన్నారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొలికపూడి వ్యవహారంపై రిపోర్ట్ అందచేస్తామని వర్లరామయ్య పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..
అక్కడికి వెళ్లిన తెలుగు సీఎంలు.. విషయం ఇదే..
Read Latest AP News And Telugu News
Updated Date - Jan 20 , 2025 | 02:33 PM