Share News

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , Publish Date - Apr 14 , 2025 | 12:35 AM

బైక్‌ - లారీ ఢీకొట్టుకున్న ఘటనలో ఒక యువకుడు మృతి చెందాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
రాయన శివతేజ (ఫైల్‌)

మరొక యువకుడికి తీవ్ర గాయాలు

మోపిదేవి, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): బైక్‌ - లారీ ఢీకొట్టుకున్న ఘటనలో ఒక యువకుడు మృతి చెందాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మోపిదేవి శివారు కొక్కిలిగడ్డ వెళ్లే అడ్డరో డ్డు వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొక్కిలిగడ్డ గ్రామానికి చెందిన రాయన శివతేజ(18), నాగ జశ్వంత్‌లు మోటారు బైక్‌పై మోపిదేవి వస్తున్నారు. చల్లపల్లి వైపు నుంచి చిత్తూరు డిస్పోజల్‌ బ్యాటరీ లోడుతో లారీ వెళ్తుండగా, కొక్కిలిగడ్డ నుంచి వెళ్తున్న బైక్‌ లారీ రెండూ ఢీకొట్టుకున్నాయి. శివతేజ, నాగ జశ్వంత్‌లకు తీవ్ర గా యాలు కాగా, గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో 108 అంబులెన్స్‌లో మచిలీపట్నం తరలించారు. చికిత్స పొందుతూ శివతేజ మృతి చెం దాడు. చెయ్యి విరిగి తీవ్రంగా గాయపడిన నాగ జశ్వంత్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ తరలించారు. మోపిదేవి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 14 , 2025 | 07:57 AM