Share News

సమస్యల పరిష్కారమే ధ్యేయం

ABN , Publish Date - Apr 03 , 2025 | 01:11 AM

ప్రజా సమస్యల పరిష్కారమే రాష్ట్ర ప్రభుత్వ ద్యేయమని ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి వీరభద్ర గౌడ్‌ అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

సమస్యల పరిష్కారమే ధ్యేయం
వీరభద్రగౌడ్‌కు వినతిపత్రం ఇస్తున్న దేవనకొండ నాయకులు

టీడీపీ ఇన్‌చార్జి వీరభద్ర గౌడ్‌

ఆలూరులో ప్రజా పరిష్కార వేదికలో అర్జీల స్వీకరణ

ఆలూరు, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారమే రాష్ట్ర ప్రభుత్వ ద్యేయమని ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి వీరభద్ర గౌడ్‌ అన్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. 2018లో గ్రీన్‌ పార్కుకు 1.50 ఎకరాలు కేటాయించగా, రూ.2 లక్షలతో ముళ్ళ కంప కూడా తొలగించారని వైసీపీ ప్రభుత్వం దాన్ని పక్కన పెట్టిందని పార్కు ఏర్పాటు చేయాలని ప్రజలు వినతిపత్రం అందించారు. అలాగే కురువల్లి- అరికెర గ్రామానికి రహదారి నిర్మించాలని గ్రామాల ప్రజలు విన్నవించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి సంబంధిత శాఖలకు పంపి పరిష్కారమయ్యేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. కన్వీనర్లు అశోక్‌, సుధాకర్‌, డా తిప్పయ్య, ఏబీసీ కెనాల్‌ డీసీ చైర్మన్‌ నగర డోన కిష్టప్ప, రఘు ప్రసాద్‌ రెడ్డి, గిరి మల్లేష్‌ గౌడ్‌, అట్టేకల్‌ బాబు, నరసప్ప, తిమ్మయ్య, కొమ్ము రామాంజినేయులు, సాలీ సాహెబ్‌, కృష్ణం నాయుడు, కొమ్ము రాజు, మసాలా జగన్‌ పాల్గొన్నారు.

కరువు మండలంగా ప్రకటించాలి

దేవనకొండ: దేవనకొండను కరువు మండలంగా ప్రకటించాలని మండల టీడీపీ నాయకులు బడిగింజల రంగన్న, వీరేష్‌ కోరారు. బుధవారం ఆలూరులో జరిగిన టీడీపీ గ్రీవెన్స్‌లో పార్ట ఇన్‌చార్జి వీరభద్ర గౌడ్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ ఏడాది పంటలు సరిగా పండలేదని, రైతులు అప్పులపాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. నాయకులు వెంకటస్వామిగౌడ్‌, రామాంజీనేయులు, సుధాకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2025 | 01:11 AM