Share News

ప్లాట్‌ఫారాలన్నీ రైతులకే..

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:03 AM

కర్నూలు మార్కెట్‌ కమిటీ సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రటరీ జయలక్ష్మి స్పందించారు. యార్డులో ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫారాలన్నీ రైతులకు సంబం ధించిన పంట ఉత్పత్తులు నిల్వ చేసుకోవడా నికేనని స్పష్టంచేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాపారులకు వాటిని కేటాయించడం జరగదని స్పష్టం చేశారు.

ప్లాట్‌ఫారాలన్నీ రైతులకే..
ప్లాట్‌ఫారాలపై వ్యాపారులు నిల్వ చేసిన మిర్చి నిల్వలు

వ్యాపారులకు ఇచ్చేదే లేదు

సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రటరీ జయలక్ష్మి

వ్యాపారుల్లో మొదలైన గుబులు

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్‌

కర్నూలు అగ్రికల్చర్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): రూ.లక్షలు ఖర్చు పెట్టి కర్నూలు మార్కెట్‌ యార్డులో రైతులు పండించిన పంట ఉత్పత్తులను నిల్వ చేసేందుకు ఏర్పాట్లు చేసిన ప్లాట్‌ఫారాలను వ్యాపారులు కైవసం చేసు కుంటుండటంపై రైతుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. తాము తెచ్చిన పంట ఉత్పత్తులను మండుటెండల్లో నిల్వచే స్తున్నా పట్టించుకోకుండా వ్యాపారులకు ప్లాట్‌ఫారా లను కేటాయించడంపై ఇదేమీ దారుణమంటూ కొన్ని రోజులుగా రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై ఆంధ్రజ్యోతిలో మంగళవారం ‘వ్యాపారికి అండ.. రైతుకు ఎండ’ అనే శీర్షికన ప్రచురితమైన కథనం కలకలం రేపింది. కర్నూలు మార్కెట్‌ కమిటీ సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రటరీ జయలక్ష్మి స్పందించారు. యార్డులో ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫారాలన్నీ రైతులకు సంబం ధించిన పంట ఉత్పత్తులు నిల్వ చేసుకోవడా నికేనని స్పష్టంచేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాపారులకు వాటిని కేటాయించడం జరగదని స్పష్టం చేశారు. మిర్చి యార్డులో రైతులు తమ పంట ఉత్పత్తులను ప్లాట్‌ఫారాలపై నిల్వ చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని, అందువల్లనే వ్యాపారస్థులు తాత్కాలికంగా కొనుగోలు చేసిన మిర్చిని నిల్వ చేసుకుంటున్నారనీ వివరణ ఇచ్చారు. ఇకపై రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్లాట్‌ఫారాలపైన వారి పంట ఉత్పత్తులను నిల్వ చేసుకుని అమ్ముకునేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Updated Date - Apr 16 , 2025 | 12:03 AM