Share News

వ్యాపార నైపుణ్యాలు అలవర్చుకోవాలి

ABN , Publish Date - Apr 04 , 2025 | 12:11 AM

విద్యార్థి దశ నుంచే చదువుతోపాటు వ్యాపార నైపుణ్యాలను పెంచుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్‌ పాల్‌ తెలిపారు.

వ్యాపార నైపుణ్యాలు అలవర్చుకోవాలి
మెమెంటోలు, ప్రశంసాపత్రాలు అందజేస్తున్న ఐఏఎస్‌ఈ ప్రిన్సిపాల్‌ ఆదినారాయణ రెడ్డి

డీఈవో శామ్యూల్‌ పాల్‌

కర్నూలు ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): విద్యార్థి దశ నుంచే చదువుతోపాటు వ్యాపార నైపుణ్యాలను పెంచుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్‌ పాల్‌ తెలిపారు. జిల్లా విద్యాశాఖ, ఎస్‌ఈఆర్‌టీ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం స్థానిక బీ.క్యాంపు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఎంటర్‌ప్రెన్యూనర్‌ మైండ్‌ సెట్‌ జిల్లా స్థాయి సైన్స్‌ ఎక్స్‌పో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఐఏఎస్‌ఈ ప్రిన్సిపాల్‌ ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ఎంటర్‌ప్రెన్యునర్‌ మైండ్‌ సెట్‌పై ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి శుక్రవారం తరగతి గదిలో విద్యార్థులు వీడియోలను ప్రదర్శించిన ప్రాజెక్టులు ఎంటర్‌ప్రెన్యూనర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం సంబంధించి అవగాహన కల్పించాలన్నారు. రు. ఈ సందర్బంగా పాఠశాలలో విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రాజెక్టులలో ఉత్తమ ప్రాజెక్టును ఎంపిక చేసి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు అధ్యాపకురాలు దండబోయిన పార్వతి, నాగలక్ష్మి, జిల్లా కోఆర్డినేటర్‌ గోపాలకృష్ణ, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2025 | 12:11 AM