Share News

ఉపాధి నిధులతో సీసీ రోడ్లు

ABN , Publish Date - Apr 02 , 2025 | 12:00 AM

కర్నూలు జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో నిర్మిస్తున్న సీసీ రోడ్లను లక్ష్యం మేరకు వేగవంతం చేయాలని కలెక్టర్‌ రంజిత్‌ బాషా నీటి యాజమాన్య సంస్థ అధికారులను ఆదేశించారు.

ఉపాధి నిధులతో సీసీ రోడ్లు
రోడ్డు నిర్మాణాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌ రంజిత్‌ బాషా

రాష్ట్రంలో కర్నూలుకు మొదటి స్థానం

కర్నూలు అగ్రికల్చర్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో నిర్మిస్తున్న సీసీ రోడ్లను లక్ష్యం మేరకు వేగవంతం చేయాలని కలెక్టర్‌ రంజిత్‌ బాషా నీటి యాజమాన్య సంస్థ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జాతీయ నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన పనులను కలెక్టర్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా సీసీ రోడ్ల నిర్మాణంలో రాష్ట్రంలోనే కర్నూలు జిల్లాకు మొదటి స్థానం దక్కడంతో ఆ శాఖ అధికారులు, సిబ్బందిని కలెక్టర్‌ అభినందించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ ఏడాది 8,500 ఫారం పాండ్స్‌, 300 పశువుల నీటి తొట్ల నిర్మాణానికి వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు. గత సంవత్సరం ఉపాధి హామీ పథకం ద్వారా సాధించిన ప్రగతిని కలెక్టర్‌ వివరించారు. 2.14 లక్షల కుటుంబాలకు 89 లక్షల పనిదినాలు కల్పించి రూ.250 కోట్ల వేతనాలు అందించినట్లు తెలిపారు.

Updated Date - Apr 02 , 2025 | 12:00 AM