Share News

ప్రమాదమైనా తప్పదు

ABN , Publish Date - Apr 13 , 2025 | 11:46 PM

స్థానికంగా పనులు లేకపోవడంతో కూలీలు తప్పని పరిస్థితుల్లో కూలీలు ట్రాలీ ఆటోల్లో దూర ప్రాంతాలకు వెళుతున్నారు. ఒక్కో ఆటోలో 40మంది వరకు ప్రయాణిస్తున్నారు. ఏ మాత్రం అదుపు తప్పినా ప్రమాదం చేటుచేసుకున్నా కూలీల ప్రాణాలకే ప్రమాదం.

ప్రమాదమైనా తప్పదు
ట్రాలీ ఆటోలో ప్రమాదకరంగా వెళుతున్న కూలీలు

హాలహర్వి నుంచి కర్ణాటకకు వెళ్తున్న కూలీలు

ఒక్కో ఆటోలో 40 మంది ప్రయాణం

మండలంలో ఉపాధి పనులు కల్పించని అధికారులు

హాలహర్వి, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అత్యంత వెనకబడిన మండలం హాలహర్వి. ఇక్కడ 90శాతం మంది ప్రజలు కూలీలే. మండలాన్ని కరువు పీడత ప్రాంతంగా అధికారులు గుర్తించారు. మండలంలో 10,392 జాబ్‌ కార్డులు ఉండగా కేవలం వెయ్యి మంది కూడా పనులకు రావడం లేదు. గ్రామాల్లో ఉపాధి పనులపై అవగాహన కల్పించడం లేదు. ఉపాధి విషయమై ఉన్నతాధికారులు స్థానిక అధికారులపై ఒత్తిడి చేయడంతో మండల స్థాయి అధికారులు అధిక మంది కూలీలు వస్తున్నట్లు ఉన్నతాధికారులకు బోగస్‌ నివేదికలు పంపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి.

రోజుకు రూ.250ల కూలి

తీరా అంతదూరం వెళ్లాక అక్కడ రోజుకు రూ.300లు మ్రాతమే ఇస్తున్నారని, ఇందులో ఆటోకు రూ.50లు వెళుతుండటంతో తమకు రూ.250లు మాత్రమే మిగులుతోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఊర్లేనే తమకు ఉపాధి పనులు కల్పించాలని, గిట్టుబాటు కూలీ అందేలా చూడాలని కోరుతున్నారు.

కిలోమీటర్ల దూరం వెళుతున్న కూలీలు

స్థానికంగా పనులు లేకపోవడంతో కూలీలు తప్పని పరిస్థితుల్లో కూలీలు ట్రాలీ ఆటోల్లో దూర ప్రాంతాలకు వెళుతున్నారు. ఒక్కో ఆటోలో 40మంది వరకు ప్రయాణిస్తున్నారు. ఏ మాత్రం అదుపు తప్పినా ప్రమాదం చేటుచేసుకున్నా కూలీల ప్రాణాలకే ప్రమాదం.

అమలుకాని ప్రభుత్వ ఆదేశాలు

టీడీపీ ప్రభుత్వం ఉపాధి పథకంలో అవినీతికి తావు లేకుండా మేటి వ్యవస్థను తీసుకువచ్చింది. ప్రతి గ్రామంలో శ్రమశక్తి సంఘాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర స్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కానీ ఇక్కడ అవి అమలు కావడం లేదని ఆరోపణలు ఉన్నాయి. 380 శ్రమశక్తి సంఘాలు ఏర్పాటు కావాల్సి ఉండగా, అధికారులు కేవలం 73మంది మేటీలను నియమించి మమ అనిపించారు.

వెళ్లక తప్పడం లేదు

మాది రెక్కాడితే గాని డొక్కాడిని కుటుంబాలు. ఇక్కడ పనులు లేకపోవ డంతో ఆటోలో కర్ణాటకలో మిరప కోతలకు వెళుతు న్నాం. చాలామంది ప్రమా దాలకు గురవుతున్నారు. అయినా తప్పడం లేదు. ఊర్లోనే అధికారులు ఉపాధి పనులు కల్పించాలి. - పకీరమ్మ, గూళ్యం.

ఉపాధి పనులు కల్పిస్తాం

ప్రతి కుటుంబానికి ఉపాధి పనులు కల్పిస్తాం. గ్రామాల్లో దండోరా వేయించి సమావేశాలు ఏర్పాటు చేస్తాం. కూలీలకు గిట్టుబాటు వేతనం అందేలా చూస్తాం. - పక్కీరప్ప, ఏపీడీ, ఆలూరు

Updated Date - Apr 13 , 2025 | 11:46 PM