సంగమేశ్వర క్షేత్రంలో హైకోర్టు న్యాయమూర్తి
ABN , Publish Date - Apr 07 , 2025 | 01:09 AM
నగర శివారులోని జగన్నాథగట్టుపై కొలువైన ఉమాసమేత రూపాల సంగమేశ్వర స్వామివారిని ఆదివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన.హరి నాథరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

కర్నూలు కల్చరల్, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): నగర శివారులోని జగన్నాథగట్టుపై కొలువైన ఉమాసమేత రూపాల సంగమేశ్వర స్వామివారిని ఆదివారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన.హరి నాథరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శనార్థం వచ్చిన ఆయనకు ఈఓ వై.గుర్రెడ్డి, సిబ్బంది సుబ్బారెడ్డి, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారికి పంచామృతాభిషేకములు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు సురేష్‌శర్మ పంచామృతా భిషేకం నిర్వహించి తీర్థ ప్రసాదాలు వారికి అందజేశారు.