Share News

ఆదోని పశువుల సంతలో వసూళ్ల దందా

ABN , Publish Date - Apr 08 , 2025 | 12:41 AM

పట్టణ శివారు ప్రాంతంలోని ఎమ్మిగనూరు బైపాస్‌ డంపింగ్‌ యార్డ్‌ సమీపంలో ప్రతి శుక్రవారం పశువుల సంత నిర్వహిస్తారు. ఇక్కడికి ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం, డోన్‌, కోడుమూరు, గుత్తి తదితర దూర ప్రాంతాల నుంచి రైతులు పశువులను తీసుకొస్తారు. అయితే ఇక్కడి సిబ్బంది తమ నుంచి అదనంగా వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.

ఆదోని పశువుల సంతలో వసూళ్ల దందా
సంతకు పశువులను తెచ్చిన రైతులు, పన్నుల రశీదు

ఒక్కో పశువుకు రూ.300లు..

కాంట్రాక్ట్‌ ముగిసినా వసూళ్లు

ఆదోని అగ్రికల్చర్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): పట్టణ శివారు ప్రాంతంలోని ఎమ్మిగనూరు బైపాస్‌ డంపింగ్‌ యార్డ్‌ సమీపంలో ప్రతి శుక్రవారం పశువుల సంత నిర్వహిస్తారు. ఇక్కడికి ఆదోని, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం, డోన్‌, కోడుమూరు, గుత్తి తదితర దూర ప్రాంతాల నుంచి రైతులు పశువులను తీసుకొస్తారు. అయితే ఇక్కడి సిబ్బంది తమ నుంచి అదనంగా వసూలు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.

ప్రైవేట్‌ వ్యక్తులచే దందా

పశువుకు (ఎద్దు, ఆవు, బర్రె) రూ.100లు వసూలు చేయాలి. అయితే ఇక్కడ ప్రైవేటు వ్యక్తులు పశువుకు రూ.150లు వసూలు చేయడమే కాకుండా, మరోసారికొనుగోలు చేసిన వ్యక్తి నుంచి కూడా మరో రూ.150లు దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీతో మొత్తం కలిపి రూ.300లు అవుతతుంది. అయితే ఇందుకు ఇచ్చే రశీదుపై రూ.100లు మాత్రమే ఉంటుంది. అలాగే తేదీ, వసూలు చేసిన వారి సంతకం కూడా ఉండి. ఈ దందాను ఆంధ్రజ్యోతి ప్రతినిధి ఫొటో తీస్తుండగా పక్కనే ఉన్న సచివాలయ సిబ్బంది పరుగున వచ్చి వసూలు చేస్తున్న ప్రైవేటు వ్యక్తుల నుంచి బ్యాగు, చీటి పుస్తకం లాక్కుని ఉడాయించారు.

వేలం కాంట్రాక్ట్‌ ముగిసినా..

మార్చి 31వ తేదికిస్తూ వసూళ్లు చేసే కాంట్రాక్ట్‌ గడువు ముగిసినా అలాగే వసూళ్ల దందా సాగుతోంది. సదరు గొర్రెల సంత వేలం పాటదారులు తమ పలుకుబడితో ఉదయమే వచ్చి రైతుల నుంచి వసూళ్లు చేస్తున్నారు. పురపాలక సిబ్బంది మాత్రం దందా ముగిశాక తీరికగా వస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు.

గొర్రెల సంతలోను ఇదే పరిస్థితి

గొర్రెల సంత కూడా ఇక్కడే నిర్వహిస్తారు. పురపాలక అధికారులు నిర్దేశించిన మొత్తాన్ని మాత్రమే వసూలు చేయాలని గెజిట్లో ఉంది. కానీ ఇక్కడ ఇవేవీ పాటిండం లేదు. జీవానికి రూ.20ల ప్రకారం వసూలు చేయాలి. అలా కాకుండా రూ.50లు వసూలు చేస్తున్నారు. పశువుల సంత, గొర్రెల సంతలో రైతుల నుంచి వసూలు చేసిన సొమ్ము నిజంగా ప్రభుత్వానికి వెళుతుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి అధికారులే సమాధానం చెప్పాల్సి ఉంది.

సిబ్బందిని ఏర్పాటు చేశాం

పశువుల, గొర్రెల సంతలో కిస్తూ వసూళ్లకు పురపాలక, సచివాలయ సిబ్బందిని 15 మందిని ఏర్పాటు చేశాం. కాంట్రాక్టర్లు ఎవరు కూడా వసూలు చేయడానికి వీల్లేదు. నిబంధనలు అత్రికమిస్తే చర్యలు తీసుకుంటాం. - కృష్ణ, పురపాలక కమిషనర్‌, ఆదోని

Updated Date - Apr 08 , 2025 | 12:41 AM