‘వంట గ్యాస్ ధర పెంచడం దారుణం’
ABN , Publish Date - Apr 09 , 2025 | 12:26 AM
వంటగ్యాస్ ధర రూ.50 పెంచడం దారుణమని ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి అన్నారు.

నంద్యాల రూరల్, ఏప్రిల్ 8( ఆంధ్రజ్యోతి): వంటగ్యాస్ ధర రూ.50 పెంచడం దారుణమని ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి అన్నారు. గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ మంగళవారం పట్టణంలోని సాయిబాబా సర్కిల్ వద్ద నిరసన చేపట్టారు. ఆమె మాట్లాడుతూ దేశంలో ఇప్పటికే నిత్యవసర ధరలు పెరిగి సామాన్యుడు కొనలేని తినలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ నాయకులు పాల్గొన్నారు.