Share News

జిల్లా జైలు తనిఖీ

ABN , Publish Date - Apr 05 , 2025 | 12:08 AM

పంచలింగాలలోని జిల్లా జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి శుక్రవారం తనిఖీ చేశారు.

జిల్లా జైలు తనిఖీ
రికార్డును పరిశీలిస్తున్న న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

కర్నూలు లీగల్‌, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): పంచలింగాలలోని జిల్లా జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి శుక్రవారం తనిఖీ చేశారు. జైలు విజన్‌ లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ను ఆయన తనిఖీ చేసి వాటి ప్రయోజనాల గురించి ఖైదీలకు వివరించారు. ఈ క్లినిక్‌లో ఒక అడ్వకేట్‌, ఒక పారా లీగల్‌ వలంటీర్‌ సభ్యులుగా ఉంటారని, వారు ఖైదీలకు అవసరమైన న్యాయ సహాయాన్ని అందజేస్తారని తెలిపారు. జైలులో ఉన్న ఖైదీలు సత్పవర్తనతో శిక్షను పూర్తి చేసుకుని సమాజంలో మంచి వ్యక్తులుగా సాగాలని తెలిపారు. 70ఏళ్ల వయస్సు నిండిన ఖైదీలకు, అనారోగ్యంతో బాధపడే ఖైదీలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందజేసి వారికి త్వరగా బెయిల్‌ మంజూరయ్యేలా కృషి చేస్తామని తెలిపారు. ఆ తర్వాత స్థానిక మహిళా జైలును చేశారు. బి.క్యాంపులోని జువనైల్‌ హోమ్‌ను తనిఖీ చేసి అక్కడుంటున్న బాలలకు బాలల హక్కుల చట్టాల గురించి వివరించారు. జువనైల్‌ మెజిస్ర్టేట్‌ అపర్ణ, సభ్యులు మాధవి, సునీత, న్యాయవాది లక్ష్మీనారాయణ, అబ్జర్వేషన్‌ హోం సూపరింటెండెంట్‌ హుసేన్‌ బాషా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 05 , 2025 | 12:08 AM