Share News

మహానందిలో జాయింట్‌ డైరెక్టర్‌ పూజలు

ABN , Publish Date - Apr 07 , 2025 | 01:11 AM

మహానంది క్షేత్రంలో ఆది వారం సాయంత్రం న్యూ ఢిల్లీ మినిస్ట్రీ ఆఫ్‌ ఫైనాన్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌ హెచ్‌కే అమర్‌నాథ్‌ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మహానందిలో జాయింట్‌ డైరెక్టర్‌ పూజలు
జాయింట్‌ డైరెక్టర్‌కు మెమెంటో అందజేస్తున్న అర్చకుడు

మహానంది, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): మహానంది క్షేత్రంలో ఆది వారం సాయంత్రం న్యూ ఢిల్లీ మినిస్ట్రీ ఆఫ్‌ ఫైనాన్స్‌ జాయింట్‌ డైరెక్టర్‌ హెచ్‌కే అమర్‌నాథ్‌ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ప్రధాన గర్బాలయంలో స్వామి వారికి జలాభిషేకం, కామేశ్వరీ దేవి అమ్మవారికి కుంకుమార్చన పూజలను నిర్వహించారు. కల్యాణ మంటపంలో వీరిని ఆలయ అర్చకుడు బెక్కెం శరభయ్యశర్మ ఆశీర్వదిం చారు. స్వామి వారి మెమెంటోతో పాటు ప్రసాదాలను అందజేశారు.

Updated Date - Apr 07 , 2025 | 01:11 AM