Share News

రేపటి నుంచి ‘పది’ మూల్యాంకనం

ABN , Publish Date - Apr 01 , 2025 | 11:49 PM

నంద్యాల ఎస్‌డీఆర్‌ ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి 10వ తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం నిర్వహిస్తున్నట్లు డీఈవో జనార్దన్‌రెడ్డి తెలిపారు.

రేపటి నుంచి ‘పది’ మూల్యాంకనం

నంద్యాల ఎడ్యుకేషన్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): నంద్యాల ఎస్‌డీఆర్‌ ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి 10వ తరగతి జవాబుపత్రాల మూల్యాంకనం నిర్వహిస్తున్నట్లు డీఈవో జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ఈనెల 3వతేదీ నుంచి 9వ తేదీ వరకు మూల్యాంకనం పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించిందన్నారు. మూల్యాంకనం కోసం 168 చీఫ్‌ ఎగ్జామినర్లు, 966 మంది సహాయ ఎగ్జామినర్లు, 205 మంది ప్రత్యేక సహాయకులను నియమించామని తెలిపారు. అలాగే జిల్లాకు 1,90,000 జవాబు పత్రాలను కేటాయించారని, మూల్యాంకనం కోసం నియమించిన ఉపాధ్యాయులు ఈనెల 3వ తేదీన ఉదయం 9గంటలలోపు ఎస్‌డీఆర్‌ పాఠశాలకు చేరుకోవాలన్నారు.

Updated Date - Apr 01 , 2025 | 11:49 PM