Share News

ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Apr 13 , 2025 | 12:14 AM

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పార్థసారథి పేర్కొన్నారు. ఈనెల 19న ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో నిర్వహించనున్న జాబమేళా పోస్టర్లను శనివారం క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు.

ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
పోస్టర్లను విడుదల చేస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి

ఎమ్మెల్యే డాక్టర్‌ పార్థసారథి

ఆదోని అగ్రికల్చర్‌, ఏప్రిల్‌ 12 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే పార్థసారథి పేర్కొన్నారు. ఈనెల 19న ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో నిర్వహించనున్న జాబమేళా పోస్టర్లను శనివారం క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. నిరుద్యోగ యువతీ, యువకుల కోసం నైపుణ్య అభివృద్ధి సంస్థ జాబ్‌ మేళాను నిర్వహిస్తుందన్నారు. ఈ జాబ్‌ మేళాలో 13 బహుళ జాతి కంపెనీ ప్రతినిధులు ఉద్యోగాలకు ఎంపిక చేస్తారన్నారు. పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ, డిప్లొమా, బిటెక్‌, ఎంబీఏ పూర్తి చేసిన యువతీ, యువకులు పాల్గొనాలని సూచించారు. వివరాలకు ఆనంద్‌ కుమార్‌ జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి 9177413642, 9703993995 నెంబర్లకు సంప్రదించాలని నిరుద్యోగ యువతీ, యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Updated Date - Apr 13 , 2025 | 12:14 AM