ఇసుక తోడేళ్లు
ABN , Publish Date - Apr 13 , 2025 | 12:09 AM
ఉచిత ఇసుక పేరుతో ఇసుక దోపిడీ చేస్తున్నారు. వేదవతి నదిలో అక్రమార్కులు తెగడ్డారు. ఇంత జరుగుతున్నా నిఘా ఉంచాల్సిన ఆధికారులు పట్టించుకోవడం లేదు. మండలంలోని జే హోసల్లి, గూళ్యం, సిద్దాపురం గ్రామాల్లో వేదవతి ఆనవాలు కల్పోయే ప్రమాదం ఉంది.

ఉచితం పేరుతో అడ్డగోలు దోపిడీ
ఉనికి కోల్పోతున్న వేదవతి నది
హాలహర్వి, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): ఉచిత ఇసుక పేరుతో ఇసుక దోపిడీ చేస్తున్నారు. వేదవతి నదిలో అక్రమార్కులు తెగడ్డారు. ఇంత జరుగుతున్నా నిఘా ఉంచాల్సిన ఆధికారులు పట్టించుకోవడం లేదు. మండలంలోని జే హోసల్లి, గూళ్యం, సిద్దాపురం గ్రామాల్లో వేదవతి ఆనవాలు కల్పోయే ప్రమాదం ఉంది. నది నుంచి ఇసుక తరలించేందుకు అనుమతి లేకపోయినా ఆలూరు, చిప్పగిరి, మండలాల నుంచి భారీగా ట్రాక్టర్లలో ఇసుకను తరలించేస్తున్నారు. అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.
ఈ విషయాన్ని తహసీల్దార్ నజీమా భాను దృష్టికి తీసుకెళ్లగా వేదవతి నంది నుంచి ఇసుక తరలించడానికి అనుమతి లేదన్నారు. ఎవరైనా తరలిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.