శ్రీమఠంలో ఎస్‌బీఐ చైర్మన్
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:07 AM
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామిని ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీని వాసులు శెట్టి ఆదివారం దర్శించుకున్నారు.

రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న చైర్మన్ శ్రీనివాసులు శెట్టి
సోలార్ ఏర్పాటుకు రూ.40 లక్షలు విరాళం
నూతన హంగులతో ఎస్‌బీఐ బ్రాంచ్ ప్రారంభం
మంత్రాలయం, ఏప్రిల్ 13 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామిని ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీని వాసులు శెట్టి ఆదివారం దర్శించుకున్నారు. ముందుగా ఎస్‌బీఐ చైర్మన్ గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మఠం పీఠాధిపతి సుబు దేంద్ర తీర్థులు మెమొంటో, శేషవస్త్రం, పరిమళప్రసాదం ఇచ్చి ఆశీర్వ దించారు. ఈ సందర్భంగా మంత్రాలయంలో నూతన హంగులతో ఏర్పాటు చేసిన ఎస్‌బీఐ బ్రాంచ్‌ను ఆయన మంత్రాలయం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠానికి ఎస్‌బీఐ ఆధ్వర్యంలో సోలార్ ఫలకాలను నిర్మించేందుకు ఎస్‌బీఐ చైర్మన్ రూ.40 లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో అమరావతి చీఫ్ జనరల్ మేనేజర్లు రాజేష్ కుమార్ పాటిల్, సంజయ్ కుమార్, దినేష్‌గులాటి, ఆర్‌ఎం శ్రీనివాసులు, మంత్రాలయం మేనేజర్ రాజశేఖర్, రామచంద్ర నాయక్, కృష్ణవేణి, రవి, వీరేష్, నరసప్ప, మఠం ఏఏవో మాధవశెట్టి, మఠం మేనేజర్లు వెంకటేశ్ జోషీ, సురేష్ కోనాపూర్, శ్రీపతాచార్, అసి స్టెంట్ మేనేజర్ ఐపీ నరసింహమూర్తి, బ్యాంకు సిబ్బంది కిరణ్ కుమా ర్, రావూఫ్, నరసప్ప, ప్రసాద్, మహేష్, ఉరుకుందమ్మ, వీరేష్, విఠోభ, రవి, రహంతుల్లా, మహబూబ్ బాసా, సద్దాం హుశేన్‌లు పాల్గొన్నారు.
శ్రీమఠానికి ఎస్‌ఐబీఐ సహకారం
శ్రీమఠంలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ఎస్‌బీఐ తోడ్పాటు ఇస్తూనే పరస్పర సహకారం అందిస్తామని ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి వెల్లడించారు. గతంలో ఎస్‌బీఐ ద్వారా సహకారం అందించామని, భవిష్యత్‌లో కూడా పూర్తి సహకారం అందిస్తామన్నారు. సోలార్ ప్లాంట్ ఏర్పాటు వల్ల శ్రీమఠానికి విద్యుత్ ఆదా అవుతుందన్నారు.
బ్యాంకింగ్ రంగంలో దూసుకున్న పోతున్న ఎస్‌బీఐ
ప్రపంచ బ్యాంకింగ్ రంగంలో ఎస్‌బీఐ మెరుగైన సేవలు అందిస్తూ దూసుకుపోతోందని శ్రీమఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు కొనియాడారు. ఎస్‌బీఐ వ్యాపారస్థులు, రైతులు, పొదుపు గ్రూపు మహిళలకు అండగా ఉంటూ భద్రతకు మారుపేరుగా నిలిచిందన్నారు. రూ.40 లక్షలతో సోలార్ ప్రాజెక్టు మంజూరు చేయడం అభినందనీయమని అన్నారు.