ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించండి
ABN , Publish Date - Apr 08 , 2025 | 12:39 AM
ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించయాలని, అర్జీదారులను సంతృప్తిపరచాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. సోమవారం కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం-పీజీఆర్‌ఎ్‌సలో అర్జీలను స్వీకరించారు.

ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
ఆదోని, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించయాలని, అర్జీదారులను సంతృప్తిపరచాలని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. సోమవారం కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం-పీజీఆర్‌ఎ్‌సలో అర్జీలను స్వీకరించారు.
మండలాల నుంచి వచ్చిన సమస్యలు కొన్ని
కౌతాళం మండలం కామవరం గ్రామానికి చెందిన శివలింగప్ప తనకు వృద్ధాప్య పింఛన్, ఇంటి పట్టా మంజూరు చేయాలని అర్జీ సమర్పించారు.
ఆదోని మండలం దానాపురం గ్రామం బీసీ కాలనీలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఉమాదేవి, ఖాసింబీ, శివమ్మ, తులసి అర్జీ సమర్పించుకున్నారు.
కౌతాళం మండలం వల్లూరు గ్రామానికి చెందిన ఆనంద్ తనకు దివ్యాగుల పింఛన్ మంజూరు చేయాలని అర్జీ ఇచ్చారు.
సర్వే నెం. 159లో 8.06ఎకరాల భూమి వారసత్వంగా సక్రమించిందని, సర్వే చేసి హద్దులు చూపాలని ఆదోని పట్టణానికి చెందిన సూర్యపోగు మోజెస్ అర్జీ సమర్పించుకున్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ సర్వేయర్స్ శ్రీనివాసరాజు, వేణు సూర్య, డీఎల్పీవో నూర్జహాన్, ఆర్‌దబ్ల్యూఎస్ ఈఈ పద్మజ, ఆర్టీసీ డిపో మేనేజర్ మహ్మద్ రఫీ, డిప్యూటీ డీఎంహెచ్వో సత్యవతి, డీటీ గుండాల నాయక్, వలి బాషా పాల్గొన్నారు.