శ్రీరాముని జీవితం స్ఫూర్తిదాయకం
ABN , Publish Date - Apr 15 , 2025 | 01:22 AM
శ్రీరాముని జీవితం వర్తమాన సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.

పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత
కర్నూలు కల్చరల్, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): శ్రీరాముని జీవితం వర్తమాన సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. సోమవారం నగరంలోని మామి దాలపాడు సమీపంలోగల శ్రీ గోదారంగనాథస్వామి దేవస్థానం (గోదాగోకుల క్షేత్రం)లో ఐదు రోజులపాటు కొనసాగే శ్రీరామాయణ మహాయజ్ఞం, రామాయణ పారాయణం కార్యక్రమాలను వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి టీజీ భరత మహాయజ్ఞ కార్యక్రమాన్ని పలువురు జీయర్ స్వాముల ఆధ్వర్యంలో ప్రారంభించారు.
శ్రీమద్రామాయణం ధార్మిక జీవన మార్గదర్శిని
- త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామీజీ
యుగయుగాలుగా, తరతరాలుగా మానవులందరికీ ఆదర్శవంత మైన జీవన మార్గాన్ని ప్రబోధించే అద్భుత కావ్యం శ్రీమద్రామాయ ణమని త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామీజీ ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో రామాణయంలోని వివిధ అంశాలపై పలువురు పండితులు ప్రసంగించారు. గోదాగోకులం వ్యవస్థాపక అధ్యక్షుడు మారం నాగరాజ గుప్త, మేనేజింగ్ ట్రస్టీ పల్లెర్ల నాగరాజు, వికాస తరంగిణి కేంద్ర సమితి అధ్యక్షుడు తటి. రమేష్ గుప్త తదితరులు పాల్గొన్నారు.