ఎల్లెల్సీకి నీరు నిలిపివేత
ABN , Publish Date - Apr 16 , 2025 | 01:15 AM
తుంగభద్ర డ్యామ్ దగ్గర ఎల్లెల్సీ ద్వారా ఆంధ్రప్రదేశకు విడుదల అవుతున్ననీటి వాటను మంగ ళవారం డ్యామ్ అధికారులు నిలిపివేశారు.

గోనెగండ్ల సెక్షనకు చేరిన 146 క్యూసెక్కులు
జీడీపీకి 82 క్యూసెక్కుల నీరు మళ్లింపు
గోనెగండ్ల, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): తుంగభద్ర డ్యామ్ దగ్గర ఎల్లెల్సీ ద్వారా ఆంధ్రప్రదేశకు విడుదల అవుతున్ననీటి వాటను మంగ ళవారం డ్యామ్ అధికారులు నిలిపివేశారు. దీంతో మంగవారం ఉదయం వరకు విడుదలైన నీరు మాత్రమే ఆంధ్ర కు చేరుతుంది. ఈనీరు మరో రెండు రోజులు అరకొరగా చేరుతున్నట్లు ఇరిగేషన అఽధికారులు తెలు పుతున్నారు. గోనెగండ్ల సెక్షనకు 146క్యూసెక్కుల నీరు విడుదల అయిం ది. ఈనీటిలో 64 క్యూసెక్కుల నీటిని కోడుమూరుకు విడుదల చేశారు. ఇప్పటికే ఈ ఏడాది ఎల్లెల్సీ కింద సాగు, తాగునీటి సమస్య లేకుండా చూసేందుకు అఽధికారులు చర్యలు తీసుకున్నారు. కొన్ని రోజుల నుంచి ఆంధ్ర బార్డర్ హోళగుంద, ఆదోని, ఎమ్మిగనూరు, గోనెగండ్ల, కోడు మూరు సెక్షనలలో ఉన్న నీటి కుంటలు, వాగులు, వంకలు, చెరువులు, సమ్మర్ స్టోరేజి ట్యాంక్‌లను నీటితో నింపేందుకు చర్యలు తీసుకున్నట్లు ఇరిగేషన అధికారులు తెలిపారు.
మరో రెండు రోజులు ఎల్లెల్సీ నీరు మళ్లింపు
గాజులదిన్నె ప్రాజెక్టుకు మరో రెండు రోజులు తుంగభద్ర దిగువ కాలువ నీటిని గోనెగండ్ల ఎస్కేప్ చానల్ ద్వారారోజుకు 82 క్యూసెక్కుల నీటిని ఇరిగేషన అధికారులు మళ్లిస్తున్నారు. ఎల్లెల్సీ కాలువకు నీటి విడుదలను అధికారులు నిలిపివేయడంతో ప్రస్తుతం విడుదల అవు తున్న నీటిని గాజులదిన్నె ప్రాజెక్టు మళ్లించనున్నట్లు అధికారులు తెలి పారు. ప్రాజెక్టులో ప్రస్తుతం నీరు 1.2 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. జూన, జూలై నెలలోవర్షాలు కురిసే వరకు ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటితోనే తాగునీటి పథకాలకు కొనసాగించాల్సి వస్తుంది. ఎండ వేడిమి కారణంగా రోజకు 30 నుంచి 40 క్యూసెక్కుల నీరు ఆవిరి(వృధా) అవు తుంది. ప్రాజెక్టు కింద సాగుచేసిన 13,000 ఎకరాలకు మరో నాలుగు రోజులు నీటి విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది.