కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలి
ABN , Publish Date - Apr 16 , 2025 | 01:12 AM
భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పుప్పాల సత్యనారాయణ అన్నారు.

ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి
కర్నూలు న్యూసిటీ, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పుప్పాల సత్యనారాయణ అన్నారు. మంగళవా రం ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమా వేశంలో ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం 1996ను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కార్మికులకు ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న క్లైయి మ్స్‌కు సంబంధింఽచి నిధులను కేటాయిస్తామని ఉపముఖ్యమంత్రి హామీ నెరవేరలేదన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎస్. మునెప్ప, నాయకులు చంద్రశే ఖర్, కురువకృష్ణ, రేణుక, ఇమాంబీ, శివకృష్ణ, పార్వతి పాల్గొన్నారు.