అభివృద్ధి పనులతో వైసీపీకి గుబులు
ABN , Publish Date - Apr 07 , 2025 | 12:35 AM
రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న అభివృద్ది పనులను చూసి వైసీపీలో గుబులు రేగుతుందని ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి అన్నారు. ఆదివారం అవుకు మండలం అన్నవరం గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు.

మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి
అన్నవరం గ్రామంలో రోడ్డు నిర్మాణానికి భూమి పూజచేసిన మంత్రి
అవుకు, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న అభివృద్ది పనులను చూసి వైసీపీలో గుబులు రేగుతుందని ఆర్‌అండ్‌బీ మంత్రి బీసీ జనార్థన్‌రెడ్డి అన్నారు. ఆదివారం అవుకు మండలం అన్నవరం గ్రామంలో బీటీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఆయనకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కాటసాని చంద్రశేఖర్‌రెడ్డి, చల్లా విజయభాస్కర్‌రెడ్డి, టీడీపీ అవుకు అధ్యక్షుడు ఐ.ఉగ్రసేనారెడ్డి, కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి, వంగల పరమేశ్వరరెడ్డి, మాదిరెడ్డి కాశిరెడ్డి ఘనస్వాగతం పలికారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి పల్లెకు మెరుగైన రహదారులే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని తెలిపారు.
చెన్నంపల్లె, చిన్నకొట్టాల, నిచ్చెనమెట్ల, అన్నవరం, వేములపాడు, జంబులదిన్నె గ్రామాలను అనుసంధానిస్తూ రూ. 18 కోట్లతో 12.60 కి.మీ రహదారిని నిర్మిస్తున్నామన్నారు. అన్నవరం గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూరు చేస్తున్నామన్నారు. గతంలో జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే విధ్వంసంతో పాలన ప్రారంభించి, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడమే కాక రాష్ర్టానికి రాజధాని లేకుండాచేసిన ఘనత వైసీపీకే దక్కిందని విమర్శించారు. ప్రజల్లో ఆదరణ కోల్పోయి వైసీపీ 11 సీట్లకే పరిమితమైందన్నారు. అభివృద్ది సంక్షేమంతోనే రాష్ర్టాభివృద్ది సాధ్యమన్నారు. నాయకులు మాదిరెడ్డి బాలనాగిరెడ్డి, ఈశ్వరరెడ్డి, దామోదరరెడ్డి, మొట్ల రామిరెడ్డి, వెంకటరమణనాయక్ పాల్గొన్నారు.