MP Lavu Sri Krishna Devarayalu: అప్పు చేయడం తప్పు కాదు కానీ..
ABN , Publish Date - Feb 10 , 2025 | 06:44 PM
MP Lavu Sri Krishna Devarayalu: పోలవరం ప్రాజెక్ట్‌కు రూ.12 వేలు కోట్లు మాత్రమే ఇచ్చారు కొందరు అంటున్నారని.. అయితే గత పాలనలో అసలు అభివృద్ధి జరగలేదని.. అది ముందు ఆలోచించాలంటూ వైసీపీ నేతలను పరోక్షంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు చురకలంటించారు. అలాగే కేంద్రం ఏ విధంగా ఆంధ్రప్రదేశ్‌కు సహకరిస్తుందో ఆయన వివరించారు. ఇక గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పరిణామాలను గణాంకాలతో సహా ఆయన తెలిపారు.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: అప్పు చేయడం తప్పు కాదని.. కానీ దానిని ఎలా వినియోగించాలనే దానిపై స్పష్టత ఉండాలని నరసరావుపేట లోక్ సభ సభ్యుడు లావు శ్రీకృష్ణదేవరాయులు పేర్కొ్న్నారు. 2019 -2024 మధ్య రూ.100 అప్పు తీసుకుంటే రూ. 24 మాత్రమే మౌలిక సదుపాయాలకు ఖర్చు చేశారని నీతి అయోగ్ నివేదికలో స్పష్టం చేసిందన్నారు. సంపద సృష్టించి.. అభివృద్ధి చేయాలని ఆయన పేర్కొన్నారు.
దీనిపై దేశం మొత్తం చర్చ జరగాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే ప్రతీ రాష్ట్రం ఆర్థిక పరిస్థితిపై మెరుగు పర్చాలనే అంశంపై సైతం చర్చ జరగాల్సి ఉందన్నారు. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు సైతం అలానే తీర్పు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. సోమవారం న్యూఢిల్లీలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు విలేకర్లతో మాట్లాడుతూ.. 2,369 పీఎంఎస్ స్కూల్స్ కావాలని అడిగామని.. కానీ 530 స్కూల్స్ మాత్రమే ఇచ్చారన్నారు.
ఇక స్కూల్స్ మౌలిక సదుపాయాలు, ఉపాధ్యాయుల నియామకం చేపట్టక పోవడం వల్ల.. 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ స్కూల్స్ మానేసి.. ప్రైవేట్ స్కూల్స్‌లో చేరారని వివరించారు. గత ప్రభుత్వానికి సంబంధించిన విద్యా విధానంపై దారుణమైన నివేదిక వచ్చిందని తెలిపారు.
జలశక్తికి కేంద్రం కేటాయించిన నిధులు గత ప్రభుత్వం ఖర్చు చేయలేదన్నారు. గోదావరి నుంచి పెన్న వరకు కావాల్సిన నిధులు ఇవ్వాలని ఇప్పటికే కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని చెప్పారు. విశాఖపట్నం, విజయవాడకు మెట్రో వెసులుబాటు కల్పించాలని విభజన చట్టంలో ఉందని ఆయన పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు రూ.12 వేలు కోట్లు మాత్రమే ఇచ్చారు కొందరు అంటున్నారని.. అయితే గత పాలనలో అసలు అభివృద్ధి జరగలేదని.. అది ముందు ఆలోచించాలంటూ వైసీపీ నేతలను పరోక్షంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు చురకలంటించారు.
Also Read: సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల లేఖ.. ఎందుకంటే..?
అలాగే ఇప్పటి వరకు ఏం చేశారో కూడా చెప్పి.. వారు ప్రశ్నిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీకి సంబంధించిన సూచనలు ఏమైనా ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వండంటూ వైసీపీ నేతలకు స్పష్టం చేశారు. పోలవరం ఎత్తు మార్చడం లేదన్నారు. అయితే ప్రాజెక్ట్ ఎత్తు విషయంలో మాత్రం అపోహలు సృష్టించ వద్దని రాజకీయ పార్టీలకు ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. మొత్తం 17 మెడికల్ కాలేజీలో మూడు మాత్రమే నిర్మాణంలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
Also Read: ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు.. జగన్ వస్తారా?
ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై పార్లమెంట్‌లో తాము మాట్లాడామన్నారు. ఈ బడ్జెట్‌లో రూ. 12 లక్షలు వరకు పన్ను మినహాయింపు ఇచ్చారని వివరించారు. రాజధాని అమరావతి నిర్మాణం ఏపీ ప్రజల కోరిక అని.. అలాగే ఎన్నికల్లో సైతం తీర్పు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఇక అమరావతి రాజధాని.. గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం కోసం కేంద్రం రూ.15 వేల కోట్లు కేటాయించారన్నారు. ఏపీ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు గత పాలనలో ముందుకు వెళ్ళ లేదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం ముందుకి తీసుకెళ్లాలంటూ పిలుపునిచ్చారన్నారు. ఆ క్రమంలో కేంద్రం రూ.12 వేల కోట్లు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.
Also Read : కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికకు వెల్లువెత్తిన నామినేషన్లు
పోలవరం జాతీయ ప్రాజెక్టు, రాజధాని అమరావతి బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. ఆంధ్రుల సెంటిమెంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ అని.. ఎన్నో ఉద్యమాల తర్వాత అది ఏర్పాటు అయిందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న స్టీల్ ప్లాంట్‌పై సిఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ద పెట్టారన్నారు. ఆ క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.1,140 కోట్లు నిధులు కేటాయించారన్నారు.
Also Read: ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి
అలాగే విశాఖ రైల్వే జోన్‌తోపాటు పలు సంస్థలకు శంకుస్థాపన చేసుకున్నామని ఆయన వివరించారు. గత ఎనిమిది నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయన్నారు. రాష్ట్రాభివృద్ధిలో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. వచ్చే నాలుగేళ్లలో కూడా ఏపీకి సహకారం అందించాలని ఇప్పటికే కేంద్రాన్ని తాము కోరామని తెలిపారు.
ఏపీ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో.. నీతి ఆయోగ్ ఒక నివేదిక ఇచ్చిందని చెప్పారు. అందులో మొత్తం 18 పెద్ద రాష్ట్రాలను పరిగణనలోకి తీసుకుంటే వాటిలో ఆంధ్రప్రదేశ్‌కు 17 వ స్థానం వచ్చిందన్నారు. రెవెన్యూ గ్రోత్ 2018-2019 ఆర్థిక సంవత్సరంలో 17 శాతం ఉంటే.. అది 2022-2023 మధ్య 8.9 శాతానికి పడిపోయిందన్నారు. అదే విధంగా 2018 నుంచి 2023 మధ్య ప్రతి ఏడాది 16 శాతం చొప్పున ఆంధ్రప్రదేశ్ అప్పు పెరిగిందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు గణాంకాలతో సహా వివరించారు.
For AndhraPradesh News And Telugu News