Share News

Tirumala: స్వర్ణరథంపై మలయప్ప

ABN , Publish Date - Apr 12 , 2025 | 05:11 AM

తిరుమలలో వసంతోత్సవాల రెండో రోజు మలయప్పస్వామి స్వర్ణరథంపై భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు ఉత్సవంలో పాల్గొన్నారు

Tirumala: స్వర్ణరథంపై మలయప్ప

తిరుమల, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శుక్రవారం తిరుమలలోని వసంత మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఉదయం సర్ణరథంలో దర్శనమిచ్చారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు అత్యంత వైభవంగా జరిగిన ఈ స్వర్ణరథోత్సవంలో భక్తులు వేలాదిగా పాల్గొని గోవిందనామాలు, కర్పూర హారతులతో ఉత్సవమూర్తులను దర్శించుకున్నారు. వసంతమండపంలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా ఆలయానికి తీసుకెళ్లారు. చివరి రోజైన శనివారం భూదేవి సమేత మలయప్పస్వామితో పాటు రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి, సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామి ఉత్సవమూర్తులకూ వసంతమండపంలో స్నపన తిరుమంజనం నిర్వహించనున్నారు.

Updated Date - Apr 12 , 2025 | 05:11 AM