CM Chandrababu: డీఎస్సీపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ABN , Publish Date - Feb 25 , 2025 | 05:16 PM
CM Chandrababu: రాష్ట్రంలోని నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తామన్నారు. అందుకోసం తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలిాపారు.

అమరావతి, ఫిబ్రవరి 25: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ నిర్మాణమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే అభివృద్ధి జరుగుతోందని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాలా సాయం చేస్తోందన్నారు. కేందమే సాయం చేసి ఉండకపోతే.. మనకు మరిన్ని ఇబ్బందులు వచ్చి ఉండేవన్నారు.
ఈ నేపథ్యంలో ప్రధాని మోదీని సీఎం చంద్రబాబు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వెంటిలేటర్‌పై ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నామని చెప్పారు. గతంలో కౌరవ సభ.. ఇప్పుడు గౌరవ సభ అంటూ సీఎం చంద్రబాబు అభివర్ణించారు. అసెంబ్లీ అంటే దేవాలయంతో సమానమని తెలిపారు. అసెంబ్లీలో సోమవారం జరిగిన పరిణామాలు ఒక చీకటి రోజు అని తెలిపారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననే వ్యక్తిని.. తన రాజకీయ జీవితంలో చూడటం ఇదే తొలిసారిని సీఎం చంద్రబాబు వ్యంగ్యంగా అన్నారు.
ప్రతిపక్ష హోదా డిమాండ్ ఏ విధంగా సబబు అనేది ప్రజలు ఆలోచించాలన్నారు. ప్రతిపక్ష హోదా మేం ఇచ్చేది కాదు.. ప్రజలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు పేర్కొ్న్నారు. మా స్వార్థ ప్రయోజనాల కోసం తాము కలవ లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే కూటమిగా ఏర్పాడ్డామన్నారు.
Also Read: రైతుల కోసం ఈ పథకాలు.. వీటి వల్ల ఎన్నో లాభాలు.. ఇదే అర్హత.. ఇలా అప్లై చేసుకోండి చాలు
Also Read : మాజీ ఎంపీకి జీవిత ఖైదు
గత ప్రభుత్వ హయాంలో పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు సైతం మూసివేశారని గుర్తు చేశారు. కానీ తాము 204 అన్న క్యాంటీన్లు పునః ప్రారంభించామన్నారు. హామీల అమలుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు. అలాగే హామీల అమలుకు చిత్తశుద్ధితో పని చేస్తున్నామన్నారు. పెన్షన్లను రూ.4 వేలకు పెంచామని.. అదే దివ్యాంగులకు పెన్షన్ రూ.6 వేలకు పెంచామని సీఎం చంద్రబాబు తెలిపారు.
గత వైసీపీ పాలనలో గ్రోత్ రేట్ ఎలా తగ్గిందో స్లైడ్స్‌తో సోదాహరణగా సీఎం చంద్రబాబు వివరించారు. 2024-25లో 12.94 శాతం గ్రోత్ వచ్చిందన్నారు. వైసీపీకి ఎన్డీఏకు ఓ ఏడాది సంపదలో తేడా రూ. 62 వేల కోట్లని ఆయన పేర్కొ్న్నారు. రూ. 9,54,576 కోట్లు అప్పులు పెట్టారని తెలిపారు. గ్రోత్ రేట్‌ను డబుల్ చేయగలిగితే.. నాలుగున్నర రెట్ల ఆదాయం పెరుగుతోందని చెప్పారు. దేశంలో అత్యధికంగా తలసరి ఆదాయం ఎక్కడా అంటే తెలంగాణలో అని తేలిందని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
For AndhraPradesh New And Telugu News