Narayana Success: నారాయణలో ఇంటర్ విద్యార్థుల విజయోత్సవ సభ
ABN , Publish Date - Apr 15 , 2025 | 05:10 AM
నారాయణ విద్యాసంస్థల విజయోత్సవ సభలో ఇంటర్ టాపర్లను ఘనంగా సత్కరించారు. విద్యార్థుల కలలు సాకారం చేసేందుకు సంస్థ కృషి చేస్తోందని డాక్టర్ సింధూర నారాయణ తెలిపారు

అమరావతి, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): ‘మీ కలలను మా కలలుగా భావిస్తున్నాం. మీ ప్రతి కలనూ సాకారం చేస్తున్నాం’ అని విద్యార్థులను ఉద్దేశించి నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ డాక్టర్ సింధూర నారాయణ పేర్కొన్నారు. నారాయణ విద్యాసంస్థల ఇంటర్మీడియెట్ విద్యార్థుల విజయోత్సవ సభను విజయవాడ బెంజిసర్కిల్‌లోని నారాయణ క్యాంప్‌సలో నిర్వహించారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను, పుష్పగుచ్చాలు, శాలువాలతో సత్కరించారు. తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నారాయణపై నమ్మకం ఉంచి వారి పిల్లలను చేర్చిన తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని బ్రాంచిల్లో అత్యుత్తమ మార్కులతోపాటు అత్యధిక పాస్ పర్సంటేజీని తమ సంస్థ సాధించిందని రమా నారాయణ పేర్కొన్నారు. ఇంటర్ విద్యకు నారాయణ కేరాఫ్ అడ్ర్‌సగా మారిందని నారాయణ విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ పి.ప్రమీల చెప్పారు. కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల డీన్‌లు, ఏజీఎంలు, ప్రిన్సిపాల్‌లు తదితరులు పాల్గొన్నారు.