Kotamreddy Sridharreddy: ఆ ముగ్గురికి ఈ విజయం బహుమానం
ABN, Publish Date - Feb 03 , 2025 | 01:05 PM
Kotamreddy Sridharreddy: టీడీపీ మద్ధతుతో ముస్లిం మైనార్టీ మహిళా కార్పోరేటర్ సయ్యద్ తహసిన్ భారీ మెజార్టీతో గెలుపొందడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మంత్రి నారాయణ ఆలోచనతో మైనార్టీ అభ్యర్థినికి అవకాశం ఇచ్చారని.. తాను బలపరచినట్లు తెలిపారు.

నెల్లూరు, ఫిబ్రవరి 3: నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌ను టీడీపీ కైవసం చేసుకుంది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్ ఎన్నికలు ముగిశాయి. 41 ఓట్లతో సయ్యద్ తహసిన్ గెలుపొందారు. తహసిన్‌ను డిప్యూటీ మేయర్‌గా జేసీ కార్తీక్ ప్రకటించారు. టీడీపీ 41 ఓట్లు పోలవగా, వైసీపీ 21 ఓట్లు పోలయ్యాయి. మరోవైపు బుచ్చి మున్సిపాలిటీలోని రెండు వైస్ చైర్మన్ పదవులను టీడీపీ దక్కించుకుంది. డిప్యూటీ మేయర్‌గా సయ్యద్ తహసిన్ ఎన్నికవడంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పందించారు.
సోమవారం ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. టీడీపీ మద్ధతుతో ముస్లిం మైనార్టీ మహిళా కార్పోరేటర్ సయ్యద్ తహసిన్ భారీ మెజార్టీతో గెలుపొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. మంత్రి నారాయణ ఆలోచనతో మైనార్టీ అభ్యర్థినికి అవకాశం ఇచ్చారని.. తాను బలపరచినట్లు తెలిపారు. తాహసీన్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు తనతోపాటు, 40 మంది కార్పోరేటర్లు సహకరించి భారీ మెజార్టీ ఇచ్చామన్నారు. ఎంపీ వేమిరెడ్డి, మంత్రి నారాయణ ఆలోచనలని టీడీపీ అధిష్టానం ఆమోదించిందన్నారు. నెల్లూరు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌కు బహుమానం ఇచ్చామన్నారు. రాబోయే ఎన్నికల్లో 54 డివిజన్లను కూటమి గెలుచుకోవడం ఖాయమన్నారు. గత వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలని నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ప్రజాప్రతినిధులకు నిధులు, విధులు లేకుండా చేసిందని... అందుకే వైసీపీ మొత్తానికి మొత్తంగా ఖాళీ అవుతోందని ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.
స్వల్ప ఉద్రిక్తత
కాగా.. నెల్లూ మున్సిపల్ కార్పొరేషన్‌లో డిప్యూటీ మేయర్ ఎన్నిక సమయంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, వైసీపీ కార్పోరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో జేసీ కార్తీక్ కల్పించుకున్నారు. ఆయన సర్దిచెప్పడంతో గొడవ సర్దుమణిగింది. అనంతరం డిప్యూటీ మేయర్‌గా 41 ఓట్లతో సయ్యద్ తాహసిన్ విజయం సాధించారు.
ఇవి కూడా చదవండి...
బంగారం ధరలు షాక్ కొట్టిస్తున్నాయి..
CM Chandrababu: ఆ నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్
Read Latest AP News And Telugu News
Updated Date - Feb 03 , 2025 | 01:05 PM