Kurnool District Agricultural Crisis: ఇప్పటికి ఇవే..!
ABN, Publish Date - Mar 25 , 2025 | 05:09 AM
కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బెల్డోన గ్రామంలోని నలుగురు రైతులు పెద్ద మొత్తంలో అప్పు తీసుకుని పంటలు సాగించారు. నీటి కొరత కారణంగా పంటలు పండక, అప్పు వడ్డీలు చెల్లించలేకపోతున్న రైతులకు బ్యాంకు అధికారులు వారి ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు

ఆస్తులూ వేలం వేస్తాం!.. రైతులపై ‘సహకార’ జులుం
అప్పు కట్టలేదని టీవీలు, బైక్‌లు స్వాధీనం
కర్నూలు జిల్లా సహకార బ్యాంకు అధికారుల తీరిది!
ఆ నలుగురూ చిన్నపాటి రైతులు. కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం బెల్డోన గ్రామానికి చెందిన వీరు.. జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో ఐదేసి లక్షల చొప్పున అప్పు తీసుకున్నారు. ఆ డబ్బుతో పంటలు సాగు చేశారు. నీటి కొరత కారణంగా పంటలు పండక పెట్టుబడులు కూడా చేతికి రాలేదు. దీంతో తీసుకున్న అప్పులకు వడ్డీలు కూడా కట్టలేని దుస్థితి. ఈ పరిస్థితుల్లో జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు చెందిన పది మంది అధికారులు సోమవారం బెల్డోన గ్రామానికి వెళ్లారు. ఆ నలుగురు రైతుల ఇళ్లలో ఉన్న టీవీలు, బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ‘ఇప్పటికి చరాస్థులే సీజ్ చేస్తున్నాం, రుణాలు చెల్లించకపోతే స్థిరాస్థులూ సీజ్ చేస్తాం’ అని హెచ్చరించి వెళ్లారు.
- కర్నూలు అగ్రికల్చర్, ఆంధ్రజ్యోతి
Updated Date - Mar 25 , 2025 | 05:11 AM