Naga Babu : అడవిదొంగ పెద్దిరెడ్డిని వదిలేదిలేదు
ABN , Publish Date - Feb 03 , 2025 | 04:10 AM
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని, ఆయన అక్రమాస్తుల విలువ మన రాష్ట్ర బడ్జెట్ రూ.2లక్షల కోట్లను దాటిపోయిందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు ఆరోపించారు.

పెద్దిరెడ్డి అంటేనే అరాచకాలకు మారుపేరు
జగన్ సహా తప్పు చేసినవారెవరూ తప్పించుకోలేదు
వైసీపీ మరో 15 ఏళ్లు సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం
అసెంబ్లీకి వెళ్లని వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి
వారియర్.. పవన్ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది
పుంగనూరు జనసేన సభలో నాగబాబు
పుంగనూరు, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనలో ప్రకృతి సంపదను చెరబట్టిన అడవి దొంగ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని, ఆయన అక్రమాస్తుల విలువ మన రాష్ట్ర బడ్జెట్ రూ.2లక్షల కోట్లను దాటిపోయిందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు ఆరోపించారు. మాజీ సీఎం జగన్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి సహా అక్రమాలకు పాల్పడ్డ ప్రతి ఒక్కరిపైనా చర్యలుంటాయన్నారు. చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరని, అందరినీ మెడపెట్టి లోపల తోస్తామని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా సోమలలో ఆదివారం జరిగిన జనంలోకి జనసేన బహిరంగ సభలో మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి, పెద్దిరెడ్డిపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని రాష్ట్ర సంపదను దోచేశారన్నారు. తమను గెలిపించిన ప్రజల సమస్యలు శాసనసభలో మాట్లాడలేనప్పుడు 11మంది వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ వైసీపీ సన్నాసులు, కుక్కలు అనేక విమర్శలు చేస్తున్నారని, వారు కళ్లు తెరిచి అభివృద్ధిని చూడాలని హితవు పలికారు. పెద్దిరెడ్డి అంటే దౌర్జన్యాలు, దోపిడీలు, అరాచకాలకు మారుపేరుగా నిలిచారనే విషయం పుంగనూరు నియోజకవర్గంలో మార్మోగుతోందని నాగబాబు విమర్శించారు. పెద్దిరెడ్డి తన అక్రమాస్తుల విషయం ఎప్పటికైనా బయటపడుతుందన్న భయంతోనే మదనపల్లి ఆర్డీవో కార్యాలయంలో రికార్డులను దహనం చేయించారంటూ విమర్శించారు.
ఎన్డీఏ ప్రభుత్వానికి పగ కంటే ప్రజల సంక్షేమమే ముఖ్యమని, 8 నెలల్లో సీఎం చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, నరేంద్రమోదీలు అభివద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టారన్నారు. వైసీపీని మరో 15 ఏళ్లు సింగల్ డిజిట్ సీట్లకే పరిమితం చేసే బాధ్యత తాము తీసుకున్నామని, 15 ఏళ్లు రాష్ట్రంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు కలిసికట్టుగా ఉంటాయన్నారు. గతంలో పంచాయతీరాజ్, అటవీశాఖ మంత్రిగా పెద్దిరెడ్డి పాలనకు నేడు నీతి, నిజాయితీగా పని చేస్తున్న మంత్రి పవన్‌కల్యాణ్ పనితీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. వారియర్.. నిజయితీపరుడైన పవన్ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు తమ పార్టీ శ్రేణులందరికీ గర్వంగా ఉందని చెప్పారు. పదవుల మీద, అధికారాల మీద ఆశలేదని, పవన్ ఆశయాల మేరకే పనిచేస్తున్నామని చెప్పారు. మైనింగ్, ఎర్రచందనం, మాఫియాను అణగదొక్కుతానని అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో అన్నమయ్య జిల్లా కలికిరి సభలో ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలు పెద్దిరెడ్డికి వర్తిస్తాయన్నారు. వారి నెత్తిమీద కత్తివేలాడుతోందని, దారం తెగగానే శిక్ష తప్పదని హెచ్చరించారు. సమావేశంలో టిడ్కో చైర్మన్ అజయ్‌కుమార్, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, జనసేన నాయకులు హరిప్రసాద్, కిరణ్‌రాయల్, వేణుగోపాల్‌రెడ్డి, పగడాల రమణ, సుభాషిణి, రాందా్‌సచౌదరి తదితరులు ప్రసంగించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Drunk Man : ముద్రగడ నివాసంలో ఓ తాగుబోతు భీభత్సం...
Botsa Satyanarayana: ఉత్తరాంధ్రతోపాటు సీమకు అన్యాయం
Kondapalli Srinivas: అద్భుతం.. అస్సలు ఊహించలేదు.. బడ్జెట్‌పై మంత్రి కీలక వ్యాఖ్యలు
Read Latest AP News and Telugu News