Share News

Amaravati: అమరావతికి ప్రధాని మోదీ!

ABN , Publish Date - Mar 15 , 2025 | 04:22 AM

ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు అమరావతికి రావాల్సిందిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పునర్నిర్మాణ కార్యక్రమ పర్యటనకు మోదీ తప్పకుండా వస్తారని చెబుతున్నారు. అయితే, ఇంతవరకు ఎవరూ ధ్రువీకరించలేదు.

Amaravati: అమరావతికి ప్రధాని మోదీ!
PM Modi

ఏప్రిల్‌ 3, 4 వారాల్లో వచ్చే అవకాశం

విజయవాడ, మార్చి 14(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి పనులకు ఏప్రిల్‌ మూడు, నాలుగు వారాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేసే అవకాశముందని తెలుస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు అమరావతికి రావాల్సిందిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పునర్నిర్మాణ కార్యక్రమ పర్యటనకు మోదీ తప్పకుండా వస్తారని చెబుతున్నారు. అయితే, ఇంతవరకు ఎవరూ ధ్రువీకరించలేదు. విభజన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చాక 2015, అక్టోబరు 22న అమరావతి పనులకు మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి, డీజీపీ కార్యాలయాలను ప్రభుత్వం పూర్తిచేసింది. అయితే, వైసీపీ ప్రభుత్వం రావడంతో అమరావతి విధ్వంసం జరగడమే కాకుండా, రాజధానిని అటకెక్కించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది.


ఇవి కూడా చదవండి..

Pawan Kalyan: స్టేట్ అయినా.. సెంట్రల్ అయినా.. ఆయన క్రేజే వేరు..

Putin - Modi ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణపై పుతిన్ కీలక వ్యాఖ్యలు.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 15 , 2025 | 07:41 AM

News Hub