వైభవంగా వేంకటేశ్వరస్వామి ఉయ్యాలసేవ
ABN , Publish Date - Mar 17 , 2025 | 12:50 AM
రావులపాలెంలోని అలివేలు మంగ పద్మావతి ఆండాళ్ సమేత వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

రావులపాలెం, మార్చి 16(ఆంధ్రజ్యోతి): రావులపాలెంలోని అలివేలు మంగ పద్మావతి ఆండాళ్ సమేత వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆది వారం స్వామివారికి ఖండవల్లి రాజేశ్వర వరప్రసాద్‌చార్యులు ఆధ్వర్యంలో వాడపల్లి కమలనాథ్ అర్చకత్వంలో స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు జరిపారు. ఈ సందర్భంగా స్వామివారికి ఉయ్యాలసేవ నిర్వహించారు. ఆయా ఏర్పాట్లను ఆలయ కమిటీ చైర్మన్ పడాల పెదవెంకటరెడ్డి పర్యవేక్షించారు.