Narendra Modi: నా ప్రేమాభిమానాలు చూపించే సమయం వచ్చింది
ABN, Publish Date - Jan 08 , 2025 | 05:49 PM
మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తొలి పర్యటన సందర్భంగా, నరేంద్ర మోదీ విశాఖపట్నంలో రూ. 2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడిన క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ (narendra modi) బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. ఈ క్రమంలో నేడు విశాఖపట్నంలో రూ.2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మాట్లాడిన ప్రధాని తన అభిమానాన్ని చూపించే అవకాశం ఇప్పుడు వచ్చిందని పేర్కొన్నారు. తెలుగులో ప్రసంగం మొదలు పెట్టిన ప్రధాని మోదీ.. ఆంధ్ర ప్రజల ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఐదేళ్ల తర్వాత ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని.. చంద్రబాబు స్పీచ్‌తో సిక్సర్ కొట్టారని పేర్కొన్నారు. 60 ఏళ్ల తర్వాత దేశంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మోదీ గుర్తు చేశారు.
అండగా ఉంటాం..
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చంద్రబాబు లక్ష్యాలకు మేం ఎప్పుడూ అండగా ఉంటామని ప్రధాని అన్నారు. ఏపీ ప్రజల ఆశలు, ఆశయాలకు మద్దతుగా నిలుస్తామని చెప్పారు. ఏపీకి అన్ని రంగాల్లో మద్దతుగా నిలుస్తున్నామని, ఏపీతో భుజం భుజం కలిపి నడుస్తామని మోదీ పేర్కొన్నారు. ఇవాళ తలపెట్టిన ప్రాజెక్టులు రాష్ట్ర వికాసానికి తోడ్పడతాయని ప్రధాని వెల్లడించారు. దీంతోపాటు ఐటీ, టెక్నాలజీకి ఏపీ ప్రధాన కేంద్రం కానుందని ప్రధాని మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు.
2030 నాటికి..
ఈ ప్రాజెక్టులు ఏపీ అభివృద్ధిని సరికొత్త శిఖరాలకు చేరుస్తాయని ప్రధాని మోదీ అన్నారు. 2030లోగా 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడమే మా లక్ష్యమని ప్రధాని తెలిపారు. నవయుగ పట్టణీకరణకు ఏపీ సాక్ష్యంగా మారబోతోందని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ డిమాండ్ చాలా కాలంగా ఉందని, చిరకాల కోరిక ఈరోజు నెరవేరిందన్నారు. రైల్వే జోన్ రాకతో వ్యవసాయంతోపాటు అనేక వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు. ఏపీ అభివృద్ధి మా విజన్ అని మరోసారి గుర్తు చేశారు ప్రధాని మోదీ.
చిరకాల వాంఛ నెరవేరుతుంది: ప్రధాని
‘దేశంలో రెండు గ్రీన్ హైడ్రోజన్ హబ్‌లు వస్తుంటే.. అందులో ఒకటి విశాఖకు కేటాయించాం. గ్రీన్ హైడ్రోజన్ హబ్ ద్వారా ఎంతోమందికి ఉపాధి లభిస్తుంది. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్‌కు శంకుస్థాపన చేశాం. 3 రాష్ట్రాల్లోనే ఇలాంటి బల్క్ డ్రగ్ పార్కులు వస్తున్నాయి. చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌లో క్రిస్ సిటీ భాగం అవుతుంది. ఇప్పటికే శ్రీసిటీ ద్వారా ఏపీలో తయారీరంగం ఊపందుకుంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు పునాదిరాయి వేశాం. రాష్ట్ర అభివృద్ధిలో రైల్వే జోన్ కీలకం కానుంది. రైల్వే జోన్ ద్వారా రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుంది. రైల్వే జోన్ వల్ల వ్యవసాయ, పర్యాటక రంగాలు ఊపందుకుంటాయి.’ అని ప్రధాని మోదీ అన్నారు.
రేపు ప్రధాని పర్యటన..
ప్రధాని తర్వాత పర్యటనలో రెండో రోజు జనవరి 9న ఉదయం 10 గంటలకు భువనేశ్వర్‌లో 18వ ప్రవాసీ భారతీయ దివస్ (PBD) సదస్సును ప్రారంభించనున్నారు. గ్రీన్ ఎనర్జీ, సుస్థిర భవిష్యత్తును ప్రోత్సహించే ప్రయత్నానికి మరో ముఖ్యమైన ముందడుగు వేయనున్నారు. ప్రవాసీ భారతీయ దివస్ (PBD) అనేది భారత ప్రభుత్వం ఫ్లాగ్‌షిప్ ఈవెంట్. ఇది విదేశీయులు, భారతీయులతో కనెక్ట్ అవ్వడానికి, ఒకరితో ఒకరు పరస్పరం సంభాషించడానికి ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తుంది. ఒడిశా ప్రభుత్వ భాగస్వామ్యంతో 18వ ప్రవాసీ భారతీయ దివస్ కాన్ఫరెన్స్ భువనేశ్వర్‌లో జనవరి 8 నుంచి 10, 2025 వరకు జరుగుతోంది. ఈ ప్రవాసీ భారతీయ దివస్ కాన్ఫరెన్స్ థీమ్ "అభివృద్ధి చెందిన భారతదేశానికి విదేశీ భారతీయుల సహకారం". PBD కాన్ఫరెన్స్‌కు హాజరయ్యేందుకు 50కి పైగా వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ఎన్‌ఆర్‌ఐలు హాజరవుతున్నారు.
ఇవి కూడా చదవండి...
విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం
వావ్.. ఇది సాధారణ గుర్రం కాదు.. అసాధారణ ట్యాలెంట్..
Read Latest AP News And Telugu news
Updated Date - Jan 08 , 2025 | 08:21 PM