ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Compensation : పోలవరంలో ముందే సంక్రాంతి

ABN, Publish Date - Jan 14 , 2025 | 04:10 AM

గత జగన్‌ ప్రభుత్వంలో ఐదేళ్లూ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసినా పరిహారం అందలేదు. ఎకరాకు అదనంగా పది లక్షల చెల్లిస్తానన్న జగన్‌ హామీ....

  • నిర్వాసితులకు రూ.996 కోట్ల పరిహారం జమ

  • జగన్‌ జమానాలో ఐదేళ్లూ ఎదురుచూపులే

  • అదనంగా ‘పది లక్షల’ హామీ నీటిమూటలే

  • ఆర్భాటం లేకుండా కూటమి సర్కారు విడుదల

  • బ్యాంకు మెసేజ్‌లు చూశాక గిరిజనుల హర్షం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గత జగన్‌ ప్రభుత్వంలో ఐదేళ్లూ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసినా పరిహారం అందలేదు. ఎకరాకు అదనంగా పది లక్షల చెల్లిస్తానన్న జగన్‌ హామీ కూడా నీటిమూటలైంది. కూటమి ప్రభుత్వం ఇప్పు డు ఎలాంటి ఆర్భాటం, హంగామా లేకుం డా నిధులు విడుదల చేయడంతో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ఆనందానికి అవధుల్లేకుండా పో యాయి. శుక్రవారం నుంచి తమ బ్యాంకు ఖాతాల్లోకి నష్టపరిహారం సొమ్ము వచ్చి పడుతుండటంతో ఉబ్బితబ్బిబవుతున్నారు. వ్యక్తిగత ఖాతాల్లోకి ఇప్పటి వరకు మొత్తం ఏకంగా రూ.996 కోట్ల మేర జమ కావడంతో గిరిజనులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. సహజంగా ఇంత భారీ మె ుత్తం పరిహారం గా చెల్లించేటపుడు ప్రభు త్వం పెద్ద కార్యక్రమాన్ని చేపట్టి, పత్రికల్లో ప్రకటనలు ఇస్తుం ది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆర్భాటాలకు పోలేదు. నిర్వాసితుల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు జమ చేసినట్టుగా బ్యాంకులు మెసేజ్‌లు పంపే వరకు విషయం బయటకు తెలియదు. మెసేజ్‌లు చూశాక ఇన్నేళ్లకు తమకు డబ్బులు వచ్చాయంటూ వారు సంబరపడిపోతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం ఇచ్చిన విషయంపై శనివారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘పరిహారం పండుగ’ శీర్షికన కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఇది చూసి రాష్ట్ర మంత్రులు ఆశ్చర్యపోయారు. ఇంత మంచి సమాచారాన్ని తమకు ఎందుకు తెలియజేయలేదంటూ ఆర్థిక శాఖపై నిష్ఠూరమాడారు. మంత్రి లోకేశ్‌ కూడా ఆంధ్రజ్యోతి కథనం చూశాక ఆర్థిక శాఖను ఆరా తీశారు. ఏకంగా రూ.996 కోట్లను సహాయ పునరావాసం కింద లబ్ధిదారులకు చెల్లించామని ఆర్థిక శాఖ వెల్లడించడంతో మంత్రి లోకేశ్‌ ఒక్కసారిగా ఆశ్చరపోయారని ప్రభు త్వ వర్గాలు చెప్పాయి.


గత ప్రభుత్వ పనితీరుకూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పాలనాదక్షతకూ ఈ ఒక్క ఉదంతమే ఉదాహరణగా లోకేశ్‌ పేర్కొన్నారని చెబుతున్నారు. కాగా నిర్వాసితులకు చెల్లింపుల విషయంపై తమకు సమాచారం ఇవ్వకపోవడంపై జల వనరుల శాఖ గుర్రుగా ఉంది. ఆర్థిక శాఖ తీరుపై చంద్రబాబుకు జల వనరుల శాఖ ప్రత్యేక నోట్‌ను తయారు చేసి పంపినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.

నాడు చేతులెత్తేసిన జగన్‌

గత ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతంలో వరదల సమయంలో ముఖ్యమంత్రి హోదాలో జగన్‌ పర్యటించారు. ఆ సమయంలో నష్టపరిహారంపై స్పష్టమైన ప్రకటన చేస్తారని బాధితులు ఆశించారు. కానీ కేంద్రం నిధులు ఇస్తేనే తాను పరిహారం చెల్లిస్తానని, లేదంటే తాను చేసేదేమీ లేదన్నట్లుగా జగన్‌ వ్యాఖ్యలు చేశారు. దీంతో నిర్వాసితులు నిర్ఘాంతపోయారు. రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి చేపట్టిన పనులకు నిర్మాణ సంస్థలకు రూ.174.53 కోట్లు, భూసేకరణకు రూ.235.53 కోట్లు, సహాయ పునరావాసం కోసం రూ.586.73 కోట్లు... మొత్తంగా రూ.996.50 కోట్లను చెల్లించాల్సి ఉంది. మొత్తంగా రూ.821.97 కోట్లను భూసేకరణ, పునరావాస కార్యక్రమాల కింద నిర్వాసితుల ఖాతాలకు శుక్రవారం నుంచి శనివారం దాకా రెండు రోజుల పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ జమ చేసింది. దీంతో సంక్రాంతికి ముందే నిర్వాసితుల ఇళ్లలో పండుగ వాతావరణ కనిపిస్తోంది. కాగా గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ సానుభూతిపరులకు నష్టపరిహారం లెక్కలు తక్కువ చేసి చూపింది. ఈ లెక్కలను సరిచేయాలని అధికారులను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. కోతకు గురైన మొత్తాలూ నిర్వాసితులకు అందితే గిరిజన కుటుంబాల్లో మరింత సంతోషం వస్తుందని నిమ్మల రామానాయుడు చెబుతున్నారు.

Updated Date - Jan 14 , 2025 | 04:11 AM