వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించండి
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:44 AM
పశ్చిమ ప్రకాశంలో శాశ్వతంగా కరువును నివారించడానికి పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రఽధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు.

పుల్లలచెరువు, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి) : పశ్చిమ ప్రకాశంలో శాశ్వతంగా కరువును నివారించడానికి పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రఽధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. గురువారం పుల్లలచెరువులో వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని రైతులతో కలిసి సంతకాల సేకరణ, పోస్టు కార్డులపై వెలిగొండ పూర్తి చేయాలని రాసి రాష్ట్ర సీఎం చంద్రబాబుకు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోనే వెనుకబడిన పుల్లలచెరువు మండలంలో తాగునీటి కోసం 1000 అడుగులు బోర్లు తవ్వించిన నీరు పడడం లేదన్నారు. శాశ్వతంగా కరువు పోవాలంటే, వెలిగొండ ప్రాజెక్టు తీగలేరు-5 కాలువను పుల్లలచెరువులోని చిన్న కండ్లేరు రిజర్వాయరు వరకు పొడిగిం చాలన్నారు. పుల్లలచెరువు మండలంలో అధికారంలో వున్న పార్టీలు పట్టించుకోవడం లేదని సాగు, తాగు నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తీగలేరు-5 కాలువ ఎర్రగొండపాలెం మండలం వరకే ప్రస్తు తం ఉందని కాలువ పనులు వెంటనే ప్రారంభించి పుల్లలచెరువు చిన్న కండ్లేరుకు అనుసంధానం చేయాలని అన్నా రు. 2016 అప్పటి ఎమ్మె ల్యే పాలపర్తి డేవిడ్ రాజు ప్రస్తుత సీఎం, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లి తీగలేరు అనుసంంధానానికి అవసరమైన సర్వేకు నిధులు మంజూరు చేయించారని అన్నారు.గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఈ అంశం పట్టించుకున్న నాథుడే కరువయ్యార న్నారు. వైపాలెం టీడీపీ ఇన్‌చార్జ్ కూడా వెలిగొండకు అవసరమైన నిఽధులను సేకరించి ప్రాజెక్టు పూర్తి అయ్యేందుకు కృషి చేయాలని కోరారు. ఈ ప్రాంతంలో సాగు చేసిన బత్తాయి బోప్పాయి, నిమ్మ, అరటి, వాణిజ్య పంటలకు నీరు అందక తోటలు ఎండిపోతున్నాయని అన్నారు. వెంటనే వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని నిర్వసితులకు ప్యాకేజీ అందజేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకులు టీసీహెచ్ చెన్నయ్య, సీపీఐ మండల కార్యదర్శి జీవీ. గురునాథం, టీడీపీ మండలాధ్యక్షుడు పయ్యావుల ప్రసాద్, వైస్ ఎంపీపీ లింగంగుంట్ల రాములు, వైసీపీ నాయకులు జానకీ రఘు, ఎంపీటీసీ సభ్యుడు రాథాకృష్ణ, సర్పంచి ఓబులు, శ్రీనివాసచారి రైతులు పాల్గొన్నారు.